తనే నా గర్ల్‌ ఫ్రెండ్‌, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్‌ | Ranbir Kapoor Confirms Wedding With Alia Bhatt | Sakshi
Sakshi News home page

తనే నా గర్ల్‌ ఫ్రెండ్‌, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్‌

Published Thu, Dec 24 2020 7:37 PM | Last Updated on Thu, Dec 24 2020 8:01 PM

Ranbir Kapoor Confirms Wedding With Alia Bhatt - Sakshi

సాక్షి,ముంబై: మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయట పెట్టేశాడు.  పలు ప్రేమాయాణాలు నడిపిన ఈ బాలీవుడ్‌ హీరో ర‌ణ్‌బీర్ తన ప్రేమికురాలు అలియా భ‌ట్  అని తేల్చి చెప్పేశాడు. త్వ‌ర‌లోనే త‌మ పెళ్లి జరగనుందంటూ ఫ్యాన్స్‌కు తీపి కబురందించాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మ‌హమ్మారి  కారణంగా తమ  వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జ‌రిగి ఉండేద‌ని ర‌ణ్‌బీర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇంత‌కంటే ఇప్పుడేమీ చెప్ప‌లేను, కానీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుందా మ‌నుకుంటున్నామని  తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో  రణబీర్‌ తమ పెళ్లి కబురును తాజాగా ధృవీకరించారు. 

కాగా రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'  అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ ,నాగార్జున, డింపుల్‌ కపాడియా ఇతర కీలక పాత్రలుపోషించారు. ఫాంటసీ అడ్వెంచర్ ఫ్రాంచైజీగా  భావిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ శివ పాత్రలో,  అలియా ఇషా అనే పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ హీరోయిన్లు, కత్రినా, దీపికా పదుకోన్‌తో బ్రేకప్ తరువాత అలియాతో ప్రేమలో పడ్డాడు ర‌ణ్‌బీర్. ఈ నేపథ్యంలో వీరి పెళ్లిపై  పలు ఊహాగానాలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement