
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది బాలీవుడ్ భామ ఆలియా భట్. ఆ చిత్రంలో ‘సీత’ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది ఇప్పుడు ‘బ్రహ్మాస్త్రం’తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
(చదవండి: ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్)
ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రేస్‌మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ఆలియా తన చక్కటి గాత్రంతో తెలుగు పాటను ఆలపించి అందరిని అశ్చర్యానికి గురి చేసింది. తన స్పీచ్ ను తెలుగు పాటతో క్లోజ్ చేస్తానని చెబుతూ.. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘కేసరియా’ సాంగ్‌ని తెలుగులో అద్భుతంగా ఆలపించింది.
ఆలియా స్టేజ్ మీద పాట పాడుతుంటుంటే.. వెనకాల కూర్చున్న రణ్‌బీర్ కల్లలో ఆనందం, ముఖంలో చిరునవ్వులు కనిపించాయి. కరణ్, రాజమౌళితో పాటు అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆలియాను ప్రోత్సహించారు. తెలుగులో మాట్లాడమే కాకుండా..చక్కగా పాటను ఆలపించిన ఆలియాను అందరూ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment