Brahmastra Part One Will Be Releasing On OTT Platform October 2022, Here Details - Sakshi
Sakshi News home page

Brahmastra Movie OTT Streaming: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్‌..

Published Wed, Oct 19 2022 11:05 AM | Last Updated on Wed, Oct 19 2022 11:45 AM

OTT: Brahmastra Movie Streaming On Disney Plus Hotstar From October 23rd - Sakshi

బాలీవుడ్ క్యూట్‌ కపుల్‌ ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు.  

చదవండి: సుకుమార్‌-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్‌ చిచ్చు! అసలేం జరిగింది?

భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళి సందర్భంగా బ్రహ్మస్త్ర మూవీ వచ్చేవారంలో ఓటీటీలోకి రానుంది. అక్టోబర్‌ 23 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై హాట్‌స్టార్‌ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement