![Ranbir Kapoor Said His Favourite Telugu Hero At Brahmastra Promotion In Vizag - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/31/ranbir-kapoor.jpg.webp?itok=8Mf20sbC)
‘బ్రహ్మాస్త్ర’ మూవీ రిలీజ్‌కు ఇంకా 100 రోజులే మిగిలుంది. బాలీవుడ్ కపుల్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తొలిసారి జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లోకి రానుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన బ్రహ్మాస్త్ర హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ రణ్‌బీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ నేడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ మూవీ ప్రచారం కోసం బ్రహ్మాస్త్ర టీంతో జతకట్టాడు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. మంగళవారం వైజాగ్‌లో జరిగిన ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో రణ్‌బీర్‌కు తెలుగులో ఆయన ఫేవరెట్ యాక్టర్ ఎవరనే ప్రశ్న ఎదురైంది.
చదవండి: సల్మాన్ ఖాన్‌ను చంపేస్తా: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బహింరంగ సవాలు
దీనికి వెంటనే రణ్‌బీర్ ప్రభాస్ అని సమాధానం ఇచ్చాడు. ‘తెలుగు యాక్టర్స్ అందరూ గొప్పవారే. కానీ అందులో ఒకరి పేరు చెప్పమంటే మాత్ం మై డార్లింగ్ ప్రభాస్ పేరు చెబుతాను. ఎందుకంటే అతను నా బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు ప్రభాస్ అంటే అభిమానం కూడా’ అని చెప్పకొచ్చాడు రణ్‌బీర్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దక్షిణాది భాషల్లో(తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) విజన్‌ను అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మస్త్ర మూవీ టీంతో కలిసి జక్కన్న వైజాగ్‌లో సందడి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment