Megastar Chiranjeevi Lends Voice for Brahmastra Movie Telugu Version - Sakshi
Sakshi News home page

Brahmastra Movie: బ్రహ్మాస్త్ర కోసం చిరంజీవి వాయిస్‌ ఓవర్‌

Published Mon, Jun 13 2022 1:26 PM | Last Updated on Mon, Jun 13 2022 2:01 PM

Chiranjeevi Lent His Voice To Brahmastra Movie - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్‌ కానుంది. యే జవానీ హై దీవానీ తెరకెక్కించిన అయాన్‌ ముఖర్జీ సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ మూవీని రూపొందించాడు. ఇటీవలే టీజర్‌తో పాటు నటీనటుల లుక్స్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో వదిలింది. ఇందులో చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్‌కు వాయిస్‌ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు. మరి ట్రైలర్‌ చూడాలంటే మాత్రం జూన్‌ 15 వరకు ఆగాల్సిందే!

ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రను అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తుండగా.. అనీష్‌ శెట్టి పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. మౌనీ రాయ్‌ దమయంతి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, రణ్‌బీర్‌, దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఇటీవల వైజాగ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే!

చదవండి: ఈ సినిమాలో నేను హీరోయిన్‌ కాదు, కమెడియన్‌: రాశీ ఖన్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement