DPIFF Awards 2023: RRR wins Best film of the year Award - Sakshi
Sakshi News home page

DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్‌, నటి అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డు

Published Tue, Feb 21 2023 10:54 AM | Last Updated on Tue, Feb 21 2023 11:36 AM

DPIFF Awards 2023 List: RRR Movie Received Best Film Of The Year Award - Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్‌ ఫాల్కే ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో బెస్ట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో  సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్‌ ఫాల్కే ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. 

‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్‌ శెట్టికి మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్‌(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్‌ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్‌ ఇమాన్‌ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్‌ అవార్డులు అందుకోగా.. వెబ్‌ సిరీస్‌ విభాగంలో బెస్ట్‌ వెబ్‌సీరీస్‌గా రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌, ఉత్తమ నటుడు జిమ్‌ సార్బ్‌(రాకెట్‌ బాయ్స్‌) అవార్డుల పొందారు. 

దాదా సాహేబ్‌ ఫాల్కే ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ విజేతలు వీరే

  • ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : ఆర్‌ఆర్‌ఆర్‌
  • ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌
  • ఉత్తమ దర్శకుడు: ఆర్‌. బాల్కి(చుప్‌: ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)
  • ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌(బ్రహ్మాస్త్ర-1)
  • మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌ శెట్టి(కాంతార)
  • ఉత్తమ నటి: అలియా భట్‌(గంగూబాయి కాఠియావాడి)
  • మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌
  • క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ : వరుణ్‌ ధావన్‌(బేడియా)
  • క్రిటిక్స్‌ ఉత్తమ నటి: విద్యాబాలన్‌(జల్సా)
  • బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: సాచిత్‌ తాండన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement