dadasahebphalke award
-
DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, నటి అలియా.. ఆర్ఆర్ఆర్కు అవార్డు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. View this post on Instagram A post shared by Dadasaheb Phalke -DPIFF Awards (@dpiff_official) ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్‌సీరీస్‌గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార) ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా) క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్) -
రజనీకాంత్‌ను అభినందించిన సీఎం, గవర్నర్
Rajinikanth: అత్యుత్తమ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న నటుడు రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్.రవి అభినందనలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో నటు డు రజనీకాంత్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శాలువాతో సత్కరించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందజేశారు. వెండితెర సూర్యుడు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రజినీకాంత్‌ను ట్విట్టర్లో అభినందించారు. అందులో అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వెండితెర సూర్యుడు రజినీకాంత్ తమిళ సినిమాను తదుపరి ఘట్టానికి తీసుకుపోయారని, ఆయన ప్రపంచ స్థాయిలో పలు అవార్డులను పొందాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆనందకరమైన రోజు.. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు అందించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘ భారతీయ సినిమాకు మీరు అందించిన అసాధారణ సేవలకుగాను అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను కేంద్రం ప్రకటించింది. అవార్డు అందుకున్న మీకు.. దేశ ప్రజల తరఫున, నా తరఫున శుభాకాంక్షలు. సినిమాలను ప్రేమించే అందరికీ ఆనందకరమైన రోజు ఇది. భారతీయ సినిమాకు ఉన్నత సేవలతోనూ, వ్యక్తిగతంగా సంస్కారవంతమైన జీవితంతో మన దేశం ప్రజలను ఆకట్టుకున్నారు. అలాంటి మీరు పలు ఏళ్లపాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్
-
నేడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న రజనీకాంత్
-
ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు!
రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు ప్రకటన అభిమానుల్లో ఆనందం రేపింది. కానీ, ప్రకటన సమయం, సందర్భం మాత్రం పరిశీలకుల నుంచి పలు విమర్శలకు దారి తీసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో వారం ఉండగా తమిళ సూపర్ స్టార్‌కు అవార్డు ప్రకటించడంతో పలువురు కళ్ళెగరేస్తున్నారు. జాతీయ అవార్డులు, పద్మ పురస్కారాల వెనుక రాజకీయాలు, గత వివాదాలపై మళ్ళీ చర్చ రేగింది. రజనీకాంత్‌పై బి.జె.పి. అనుకూలుడనే ఓ ముద్ర ఉంది. నిజానికి, తమిళనాడు ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన బలంగానే చేశారు. కానీ, ఇటీవల ‘అన్నాత్తే’ చిత్ర షూటింగు వేళ హైదరాబాద్ లో అస్వస్థతకు గురై, హాస్పటల్ పాలయ్యారు. ఆ వెంటనే గత డిసెంబర్లో పార్టీ ఆలోచనను విరమించుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ద్రవిడ పార్టీలదే హవా అయిన తమిళనాట ఎలాగైనా జెండా ఎగరేయాలని బి.జె.పి భావిస్తోంది. అందుకోసం రజనీకాంత్ పార్టీ ద్వారా పరోక్ష రాజకీయ లబ్ధి పొందాలని బి.జె.పి ప్రయత్నించినట్లు పరిశీలకుల వాదన. తీరా రజనీ పార్టీ పెట్టలేదు. దాంతో, ఆఖరు నిమిషంలో ఈ అవార్డు ప్రకటనతోనైనా ఓటింగులో తమిళ తంబీలను ప్రసన్నం చేసుకోవాలని బి.జె.పి. అనుకుంటున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో... ఎవరెవరికి? పద్ధతి ప్రకారం చూస్తే, ‘‘భారతీయ సినిమా పురోగతికీ, అభివృద్ధికీ అందించిన అత్యున్నతసేవలకు గుర్తింపుగా’’ భారత ప్రభుత్వమిచ్చే అత్యున్నత సినీ అవార్డు – ఈ ఫాల్కే అవార్డు. భారతీయ సినీ పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద 1969లో ఈ అవార్డును నెలకొల్పారు. ఫాల్కే అవార్డు దక్కిన 51వ సినీ ప్రముఖుడు రజనీకాంత్. 2019వ సంవత్సరానికి గాను రజనీకి ఈ అవార్డు ప్రకటించారు. గతంలో తమిళంలో హీరో శివాజీ గణేశన్ (1996), దర్శక – నిర్మాత కె. బాలచందర్ (2000)లకు కూడా ఫాల్కే అవార్డు దక్కింది. వారి తర్వాత ఆ అవార్డు సాధించిన మూడో తమిళ సినీ ప్రముఖుడయ్యారు రజనీ. నిజానికి, దక్షిణాది సినీ ప్రముఖులకు ఫాల్కే అవార్డివ్వడం ఇది 13వ సారి. ఇప్పటి దాకా ఏడుగురు తెలుగు వారికి ఫాల్కే అవార్డు దక్కింది. తెలుగువారైన బి.ఎన్. రెడ్డి, పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని, రామానాయుడు, కె. విశ్వనాథ్‌లు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ఎదుగుదలకు ఏం చేశారు? రజనీకాంత్ ప్రతిభావంతుడు. దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు. దేశ, విదేశాల్లో మంచి మార్కెట్ ఉన్న స్టార్. దానధర్మాలు చేసిన సహృదయుడు. అందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే, సినీ నిర్మాణం, స్టూడియోల నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన లాంటి శాఖలలో మౌలిక వసతుల సదుపాయాల కల్పన, విస్తృతికి ఆయన చేసిందేమిటి? దేశవ్యాప్తంగా సూపర్ స్టార్‌గా తనను ఇంతగా ఎదిగేలా చేసిన భారత సినీ పరిశ్రమ యొక్క ఎదుగుదలలో ఆయన వంతు భాగం ఎంత, ఏమిటి? ఫాల్కే అవార్డు మార్గదర్శ కాలను ప్రస్తావిస్తూ, పలువురు నెటిజెన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవే. ఇది పూర్తిగా తమిళనాట ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార పార్టీ చేసిన ఎలక్షన్ స్టంట్ అని వారు నొసలు చిట్లిస్తున్నారు. తమిళనాట ఎం.జి.ఆర్. తరువాత మళ్ళీ ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సంపాదించిన మనిషి రజనీకాంత్. జన సంస్కృతిలో కలిసిపోయిన జానపద పాత్రగా మారిన వ్యక్తి రజనీకాంత్. తమిళంతో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన జనరంజకంగా నటించారు. రజనీ పంచ్ డైలాగులు, వాటి మీద జోకులు, ఆయనతో కార్టూన్ పాత్రలు, వీడియోలు రావడం ఆయన పాపులారిటీకి ప్రబల నిదర్శనం. కానీ, సినీరంగ పురోగతికి ఆయన చేసిందేమిటన్నప్పుడే అసలు ఇబ్బంది వచ్చి పడుతుంది.రజనీకాంత్ తన మునుపటి తరం హీరోల లాగా ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే – జనంలోనూ, సినిమాల్లోనూ వీలైనంత ఎక్కువగా కనిపించకుండా ఉంటే, తక్కువ ఎక్స్‌పోజర్‌తో ఎక్కువ కాలం నిలబడవచ్చనే ఫార్ములాను కనిపెట్టారు. తక్కువ సినిమాలు చేయడం ద్వారా, డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రంలో తేడా తెచ్చి, ఒక రకమైన బాక్సాఫీస్ బ్లాక్ మార్కెట్‌ను సృష్టించారని తమిళ సినీ వ్యాపార విశ్లేషకుల మాట. ఒకప్పటి ఎన్టీఆర్, ఏయన్నార్. ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్ లాగా ఏటా అనేక సినిమాలు చేసే పద్ధతికి విరుద్ధంగా – స్టార్లు తక్కువ సినిమాలు చేసి, ఎక్కువ డబ్బు పొందవచ్చనే పద్ధతి సినీసీమలో విస్తరించడానికి కారణం ఒకరకంగా రజనీయే! తెలుగులో చిరంజీవి మొదలు క్రమంగా తరువాతి స్టార్లంతా అదే బాట పట్టారు. దానివల్ల స్టార్ల పారితోషికం, సినీ వ్యాపారం చుక్కలనంటిదేమో కానీ, ఆ మేరకు సినీరంగంలో మరిన్ని చిత్రాల నిర్మాణం, ఉపాధి, విస్తరణ మాత్రం తగ్గాయి. అప్పట్లోనూ ఇలాగే...అవార్డుల పందేరం! వివాదం!! రజనీకి అవార్డివ్వడంతో అనేక పాత కథలు మళ్ళీ పైకొచ్చాయి. వాస్తవానికి, కొన్ని పార్టీలు – ప్రభుత్వాలు సొంత ప్రయోజనాల కోసం పాపులర్ అవార్డులను వాడుకోవడం ఎప్పుడూ ఉన్నదే! ఒకప్పటి కాంగ్రెస్ నుంచి ఇప్పటి బి.జె.పి దాకా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇలాంటి సంఘటనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు సంగతికే వస్తే, రాజకీయ కారణాల రీత్యానే హీరో ఎం.జి.ఆర్.కు ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటుడంటూ ‘భరత’ అవార్డు ఇచ్చారు. బాక్సాఫీస్ హిట్ ‘రిక్షాక్కారన్’ (1971)లోని రిక్షావాలా పాత్ర, నటన మాటెలా ఉన్నా అప్పట్లో తమిళనాట అధికార డి.ఎం.కె. నుంచి బయటకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న ఎం.జి.ఆర్.ను ఆకట్టుకొనేందుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పంచారు. ఆ రోజుల్లో అది పెను వివాదమే రేపింది. జాతీయ పత్రికలు ‘బ్లిట్జ్’, ‘లింక్’ లాంటివి మొదలు స్థానిక తమిళ పత్రిక ‘దినతంతి’ దాకా అన్నింటా అది చర్చనీయాంశం అయింది. ఒకదశలో ఆ అవార్డును వాపసు ఇచ్చేయాలని ఎం.జి.ఆర్. యోచించే దాకా వెళ్ళింది. అలాగే, ఎం.జి.ఆర్. చనిపోయిన వెంటనే ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించారు. అది మరో వివాదం. 1989లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజీవ్ గాంధీ సారథ్యంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం 1988కి ఈ అవార్డు ప్రకటన చేసింది. తమిళనాట రాజకీయ లబ్ధి కోసమే అలా ‘భారతరత్న’ ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకు ముందు 1977లో తమిళ శాసనసభ ఎన్నికలుండగా తమిళ నేత కామరాజ్‌కు కూడా 1976లో ఇలాగే మరణానంతర ‘భారతరత్న’ ప్రకటన చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. తాజాగా మళ్ళీ తమిళనాటే ఎన్నికల వేళలోనే రజనీకాంత్ కు ఫాల్కే దక్కడం తాజా వివాదమై కూర్చుంది. ‘తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయని రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు ఇచ్చారా’ అని విలేఖరుల సమావేశంలో అడిగితే, అవార్డు ప్రకటించిన సాక్షాత్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రివర్యులు ‘మీరు ప్రశ్న సరిగ్గా వేయండి’ అంటూ రుసరుసలాడడం కొసమెరుపు. మొత్తం మీద ఒక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా గౌరవార్థం ఇవ్వాల్సిన అవార్డులు, స్వప్రయోజనాల కోసం అవసరార్థం వేసే బిస్కెట్లుగా మారాయని విమర్శ వస్తోంది. పలు విమర్శలకు ప్రభుత్వ పెద్దలు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవార్డు కన్నా ఎక్కువ దాన్ని ప్రకటించిన సమయం, సందర్భం ప్రశ్నార్థకమయ్యాయి. ప్రధాన వార్తలయ్యాయి. అదే విషాదం. ఇదీ... మన తెలు‘గోడు’! సినీ రంగ పురోగతికి విశేష సేవలు అందించిన పలువురు తెలుగువారికి ఇప్పటికీ ‘పద్మ’ పురస్కారాల నుంచి ‘ఫాల్కే’ దాకా ఏవీ రాలేదు. అలా గుర్తింపు దక్కనివారిలో ఆనాటి ఎన్టీఆర్, యస్వీఆర్, సావిత్రి మొదలు ఇటీవలి దాసరి దాకా చాలామందే ఉన్నారు. స్టూడియో కట్టి, వివిధ భాషల్లో సినిమాలు నిర్మించి, తెలుగులో అత్యధిక చిత్రాల్లో హీరోగా నటించి, పంపిణీ, ప్రదర్శక శాఖల్లోనూ పాలు పంచుకున్న హీరో కృష్ణకు సైతం ఇప్పటికీ ఫాల్కే పురస్కారం దక్కనే లేదు. ఆ మాటకొస్తే, రాజకీయ కారణాల రీత్యా ఎం.జి.ఆర్.కు మరణానంతరం ‘భారతరత్న’ ఇచ్చిన ప్రభుత్వాలు మన తెలుగురత్నాలు ఎన్టీఆర్, పి.వి. నరసింహారావులను ఇప్పటికీ గుర్తించడమే లేదు. గంధర్వ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి ఇచ్చిన ‘భారతరత్న’ మన వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు రాలేదు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలకు దక్కినంత జాతీయ గౌరవం మన గాన కోయిలలు సుశీల, జానకిలకు లభించలేదు. ఏ అవార్డులు ప్రకటించినా దాదాపు ప్రతిసారీ తెలుగు వారి విషయంలో ఇదే తంతు. ఉత్తరాది, దక్షిణాది వివక్ష కూడా దీనికి ఒక కారణమని విమర్శ. – రెంటాల జయదేవ -
హ్యాండ్సమ్ విలన్... సూపర్ స్టార్... సెక్సీ సన్యాసి
వినోద్ ఖన్నా అంటే చాలామందికి అసూయ. జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాడని ఆయన గురించి అనుకుంటారు. దానికి కారణం కెరీర్ పీక్‌లో ఉండగా, బాలీవుడ్లో టాప్ హీరోగా ఉండగా దాన్నంతటనూ కాలదన్ని రజనీష్ ఆశ్రమంలో సేవ చేయడానికి ఆయన అమెరికా వెళ్లిపోయాడు. రజనీష్ ఆధ్యాత్మికంగా ఏమి చెప్పినా ఆయన పట్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంత గౌరవం ఉన్నా సగటు మనిషికి మాత్రం రజనీష్ ఆశ్రమంలో భౌతికపరమైన కట్టుబాట్లు ఉండవనీ ఎవరు ఎలా అయినా ఆనందాన్ని పొందవచ్చని ఒక నమ్మకం స్థిరపడిపోయింది. దాని వల్ల వినోద్ ఖన్నా కూడా అలాంటి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఉంటాడని చాలామందికి జెలసీ. నిజానికి వినోద్ ఖన్నా చాలా అదృష్టవంతుడు. తండ్రిది కలిగిన కుటుంబం. దేశ విభజన సమయానికి పెషావర్ నుంచి ముంబై వచ్చి స్థిరపడ్డాడు. వినోద్ ఖన్నా నాసిక్‌లో చదువుకున్నాడు. చాలా సిగ్గరి అయిన ఈ మనిషికి కాలేజీ రోజుల్లో వేసిన నాటకం ‘యాక్టింగ్ రుచి’ని చూపించింది. ఆ రోజుల్లో ఆయన చూసిన ‘సోల్వా సాల్’, ‘మొఘల్–ఏ–ఆజమ్’ సినిమాలు కూడా సినిమాల వైపు పురిగొల్పాయి. ‘రెండేళ్లు టైమ్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటా. లేకుంటే వ్యాపారం చేస్తా’ అని సినిమా రంగంలోకి వచ్చాడు. సునీల్ దత్ అతడి రూపాన్ని మెచ్చి ‘మన్ కా మీత్’ (1968)లో తొలి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వినోద్ ఖన్నా ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘సచ్చా ఝూటా’, ‘మేరా గావ్ మేరా దేశ్’ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేశాడు. కాని దర్శకుడు, గేయ కర్త అయిన గుల్జార్ అతడి జీవితాన్ని మార్చాడు. గుల్జార్ తీసిన ‘మేరే అప్నే’, ‘అచానక్’ సినిమాలు వినోద్ ఖన్నాలోని నటుడిని బయటకు తెచ్చి అతని ఇమేజ్ను మార్చాయి. ఒక వైపు అమితాబ్, మరోవైపు వినోద్ ఖన్నా సమానంగా కెరీర్లో ముందుకు సాగారు. వీరిద్దరూ కలిసి ‘హేరా ఫేరీ’, ‘ఖూన్ పసీనా’, ‘పర్వరీష్’, ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘ముకద్దర్ కా సికిందర్’ వంటి పెద్ద హిట్స్ ఇచ్చారు. అమితాబ్ ఏకఛత్రాధిపత్యాన్ని వినోద్‌ఖన్నా తన్నుకుపోబోతున్నాడు అనే స్థితికి ‘ఖుర్బానీ’ వంటి మెగాహిట్స్తో వినోద్ ఖన్నా చేరుకోవడం ఆ సమయంలో అమితాబ్ చాలా ఆందోళన చెందడం ఇండస్ట్రీకి తెలుసు. కాని హఠాత్తుగా వినోద్ ఖన్నా రజనీష్ శిష్యుడిగా మారిపోయి అన్నీ వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. అయిదేళ్లు (1982–86) అమెరికాలో వినోద్ ఖన్నా వంట సహాయకుడిగా, తోటమాలిగా ఆశ్రమంలో పని చేశాడు. కాని త్వరలోనే విసుగుపుట్టి తిరిగి ముంబై చేరుకున్నాడు. వదిలేసి వెళ్లినదాన్ని తిరిగి పొందడం దాదాపు అసంభవం. కాని వినోద్ ఖన్నా తిరిగి సెకండ్ హయ్యస్ట్ (మొదటి స్థానం అమితాబ్‌ది) పెయిడ్ హీరోగా సినిమాలు చేశాడు. ‘జుర్మ్’, ‘చాందిని’, ‘దయావన్’ వంటి సినిమాలు అతడికి పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టాయి. అయితే చాలా త్వరగానే వినోద్ ఖన్నా కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ తర్వాత రాజకీయవేత్తగా తన మార్గాన్ని మార్చుకున్నాడు. నాలుగుసార్లు ఆయన ఎంపీగా గెలిచాడు. ఇలా నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన బాలీవుడ్ స్టార్లు లేరు. వినోద్ ఖన్నా మొదటి భార్య గీతాంజలి ద్వారా అతడికి అక్షయ్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రెండవ భార్య కవిత ద్వారా సాక్షి ఖన్నా, శ్రద్ధ కలిగారు. అక్షయ్ ఖన్నా బాలీవుడ్లో నటుడిగా రాణిస్తున్నాడు. వినోద్ ఖన్నా శ్రీమంతుడిగా పుట్టాడు.. శ్రీమంతుడిగానే చనిపోయాడు. అందగాడిగా, మగటిమి ఉన్న పురుషుడిగా వినోద్ ఖన్నా గుర్తుంటాడు. ఆయన చేసిన ‘సింథాల్’ యాడ్‌ను ఎవరు మర్చిపోగలరు? ఆయన జీవించి ఉండగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ ఇచ్చి ఉంటే బాగుండేది. 2017 ఏప్రిల్ 27న మరణిస్తే సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత పురస్కారం ప్రకటించారు.వినోద్ ఖన్నా అంటే ఒక సుదీర్ఘమైన ప్రయాణం. నువ్వు దారులు మార్చుకో, తోవ తప్పు, గెలువు, ఓడు.. కాని ఆగిపోకు.. నడుస్తూ ఉండు అని ఆయన తన ప్రయాణం ద్వారా చెప్పాడు. ఆయన పాట ద్వారానే ఆయనను గుర్తు చేసుకుందాం..‘రుక్ జాన నహీ కహి తూ హార్ కే... కాంటోంపే చల్ కే మిలేగే సాయే బహార్ కే... -
'దాదాసాహెబ్ ఫాల్కే' శశి కపూర్
-
శశికపూర్‌కు ‘ఫాల్కే’ అవార్డ్
న్యూఢిల్లీ: దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న రాజ్‌కపూర్ అనంతరం ఈ పురస్కారాన్ని అందుకోనున్న మూడో వ్యక్తి కపూర్. పురస్కారం కింద ఆయన స్వర్ణకమలం, రూ. 10 లక్షల నగదు అందుకోనున్నారు. 2014 ఏడాదికి ఫాల్కే అవార్డ్ గ్రహీతగా కపూర్‌ను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. నమక్‌హలాల్, దీవార్, కభీకభీ తదితర హిట్ సినిమాల్లో కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్, ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయి. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ ప్రస్తుతం కిడ్నీ, ఇతర వయో సంబంధ వ్యాధులతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. బాలనటుడిగా..: నాలుగేళ్లకే బాల నటుడిగా తండ్రి దర్శకత్వం వహించిన పలు నాటకాల్లో కపూర్ నటించారు. ఆగ్(1948), ఆవారా(1951) తదితర సినిమాల్లోనూ బాలనటుడిగా కనిపించారు. ఆ తరువాత పోస్ట్‌బాక్స్ నెం 999, గెస్ట్‌హౌజ్, మనోరంజన్ మొదలైన సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1961లో ధర్మపుత్రతో హీరోగా మారి, దాదాపు 116 సినిమాల్లో ప్రధానపాత్రలు పోషించారు. మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్ వారి సినిమాలు సహా పలు అమెరికన్, బ్రిటిష్ సినిమాలు, నాటకాల్లో నటించిన ఘనత శశికపూర్కే దక్కింది. 1978లో సొంతంగా ఫిల్మ్వాలాస్ నిర్మాణ సంస్థను నెలకొల్పి జునూన్, కల్యుగ్, చౌరంఘీలేన్, విజేత, ఉత్సవ్ తదితర సినిమాలు నిర్మించారు. బ్రిటిష్ నటి జెన్నిఫర్ కెండాల్‌ను శశికపూర్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు కునాల్ కపూర్, కరణ్ కపూర్.. ఒక కుమార్తె సంజనాకపూర్ ఉన్నారు. 1984లో జెన్నిఫర్ కేన్సర్‌తో మరణించారు. నందాతో హిట్ పెయిర్ రాఖీ, జీనత్ అమన్, హేమమాలిని.. హీరోయిన్లతో సినిమాల్లో నటించినా.. నందాతో కలిసి నటించిన రొమాంటిక్ సినిమాలు కపూర్‌ను రొమాంటిక్ హీరో గా నిలబెట్టాయి. వారిద్దరూ జంటగా నటించిన ‘జబ్జబ్ ఫూల్ ఖిలే’, ‘నీంద్ హమారీ ఖ్వాబ్ తుమ్హారే’ తదితర సినిమాల్లో ఆర్డీ బర్మన్ స్వరకల్పనలో మొహమ్మద్ రఫీ గానం చేసిన పాటలు నేటికీ ఆల్‌టైమ్ హిట్స్‌గా నిలుస్తాయి. 2011లో పద్మభూషణ్ అందుకున్న శశికపూర్‌కు.. 1986లో న్యూఢిల్లీ టైమ్స్ సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. -
'దాదాసాహెబ్ ఫాల్కే' శశి కపూర్
భారతీయ చలనచిత్ర రంగం గౌరవ ప్రదంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. బాలీవుడ్ వెటరన్ హీరో శశి కపూర్‌ను వరించింది. 2014 సంవత్సరానికిగానూ ఆయనకు ఈ అవార్డును దక్కింది. నటుడిగానే కాక, నిర్మాత, దర్శకుడిగానూ ఖ్యాతి గడించిన శశి కపూర్ విభిన్న పాత్రలకు పెట్టిందిపేరు. 1938, మార్చి18న కోల్‌కతాలో జన్మించిన శశి.. తన తండ్రి ఫృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్‌తోపాటు ప్రయాణిస్తూ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. సంగ్రామ్, దండపాణి చిత్రాల్లో బాలనటుడిగా బాలీవుడ్ రంగప్రవేశం చేసి 50కిపైగా సిసిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి వెర్సటైల్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. రెండుసార్లు జాతీయ అవార్డు, మూడుసార్లు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన 1999 తర్వాత నటనకు స్వస్తిచెప్పారు. అప్పటినుంచి ఆరోగ్య కారణాలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.