
Rajinikanth: అత్యుత్తమ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న నటుడు రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్.రవి అభినందనలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో నటు డు రజనీకాంత్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శాలువాతో సత్కరించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందజేశారు.
వెండితెర సూర్యుడు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రజినీకాంత్‌ను ట్విట్టర్లో అభినందించారు. అందులో అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వెండితెర సూర్యుడు రజినీకాంత్ తమిళ సినిమాను తదుపరి ఘట్టానికి తీసుకుపోయారని, ఆయన ప్రపంచ స్థాయిలో పలు అవార్డులను పొందాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ఆనందకరమైన రోజు..
రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు అందించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘ భారతీయ సినిమాకు మీరు అందించిన అసాధారణ సేవలకుగాను అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను కేంద్రం ప్రకటించింది. అవార్డు అందుకున్న మీకు.. దేశ ప్రజల తరఫున, నా తరఫున శుభాకాంక్షలు. సినిమాలను ప్రేమించే అందరికీ ఆనందకరమైన రోజు ఇది. భారతీయ సినిమాకు ఉన్నత సేవలతోనూ, వ్యక్తిగతంగా సంస్కారవంతమైన జీవితంతో మన దేశం ప్రజలను ఆకట్టుకున్నారు. అలాంటి మీరు పలు ఏళ్లపాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment