'దాదాసాహెబ్ ఫాల్కే' శశి కపూర్
భారతీయ చలనచిత్ర రంగం గౌరవ ప్రదంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. బాలీవుడ్ వెటరన్ హీరో శశి కపూర్ను వరించింది. 2014 సంవత్సరానికిగానూ ఆయనకు ఈ అవార్డును దక్కింది. నటుడిగానే కాక, నిర్మాత, దర్శకుడిగానూ ఖ్యాతి గడించిన శశి కపూర్ విభిన్న పాత్రలకు పెట్టిందిపేరు.
1938, మార్చి18న కోల్కతాలో జన్మించిన శశి.. తన తండ్రి ఫృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్తోపాటు ప్రయాణిస్తూ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. సంగ్రామ్, దండపాణి చిత్రాల్లో బాలనటుడిగా బాలీవుడ్ రంగప్రవేశం చేసి 50కిపైగా సిసిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి వెర్సటైల్ యాక్టర్గా పేరుతెచ్చుకున్నారు. రెండుసార్లు జాతీయ అవార్డు, మూడుసార్లు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన 1999 తర్వాత నటనకు స్వస్తిచెప్పారు. అప్పటినుంచి ఆరోగ్య కారణాలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.