
Alia Bhatt First Look Released From Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఆమె ప్రియుడు రణ్‌బీర్ కపూర్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే నేడు అలియా బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 15న అలియా 29వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అయాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజింగ్ వీడియో షేర్ చేశాడు. కాగా ఇందులో అలియా పాత్ర పేరు ఇషా.
ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే మై లిటిల్ వన్. ఈ ప్రత్యేకమైన రోజున మా బ్రహ్మస్త్ర శక్తి.. ఇషా స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రంలో రణ్‌బీర్ సూపర్ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల చిత్ర బృందం మోషన్ పోస్టర్ ద్వారా తెలిపింది. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున్ అక్కినేని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment