బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్‌‌ హీరో.. కరణ్ జోహార్‌ క్లారిటీ..! | Karan Johar Reacts On KGF star Yash playing Dev in Brahmastra 2 | Sakshi
Sakshi News home page

Brahmastra 2: బ్రహ్మస్త్ర-2లో యశ్.. కాదు అతనేనన్న కరణ్ జోహార్

Published Fri, Oct 28 2022 9:25 PM | Last Updated on Fri, Oct 28 2022 9:28 PM

Karan Johar Reacts On KGF star Yash playing Dev in Brahmastra 2 - Sakshi

కేజీఎఫ్‌ హీరో యశ్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది. రాఖీభాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత యశ్‌ తన తర్వాత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్‌కు ప్రముఖ నిర్మాతలు యశ్‌ను సంప్రదించారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్‌ ఆఫర్లు వచ్చాయని టాక్. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర- పార్ట్‌2 కోసం యశ్‌ను సంప్రదించారని నెట్టింట్లో వైరలైంది.

అయితే ఈ విషయంపై బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్‌ జోహార్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్‌ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు' అని కొట్టిపారేశారు. బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా మహాభారతం ఆధారంగా  ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను సంప్రదించారని మరో టాక్. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement