బ్రహ్మస్త్ర జంటపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్ | Alia Bhatt Given Clarity On Rumours On Their Next Film | Sakshi
Sakshi News home page

Alia Bhatt: మరో చిత్రంలో రణ్‌బీర్- ఆలియా జోడి.. రూమర్లకు చెక్

Published Sat, Sep 17 2022 9:34 PM | Last Updated on Sat, Sep 17 2022 10:06 PM

Alia Bhatt Given Clarity On Rumours On Their Next Film  - Sakshi

బ్రహ్మస్త్ర సక్సెస్ తర్వాత రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ మరోసారి తెరను పంచుకోనున్నారా? ఇద్దరు కలిసి మరో రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించనున్నారా? అన్న అభిమానుల సందేహాలకు తెరదించింది ఈ బాలీవుడ్ జంట. తామిద్దరం ప్రస్తుతానికి మరే చిత్రంలో నటించడం తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు తెరదించారు.  

(చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో బ్రహ్మస్త్ర జంట సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

రూమర్లపై రణ్‌బీర్‌ కపూర్ స్పందిస్తూ 'మా ఇద్దరి నిజ జీవితంలో సరదాగా ఉన్నాం. ప్రస్తుతానికి మేమిద్దరం మరే చిత్రంలోనూ నటించడం లేదని' అన్నారు. అయితే ఆలియాభట్ మాట్లాడుతూ నేను రూమర్ల గురించి విన్నాను. కానీ మా తరువాత చిత్రం బ్రహ్మస్త్ర పార్ట్‌ -2 మాత్రమేనని తేల్చేసింది. బ్రహ్మస్త్ర కాకుండా అయాన్ ముఖర్జీ ఇతర సినిమాల్లో నటించడానికి అనుమతి ఇస్తారో లేదో తెలియదని (నవ్వుతూ) చెప్పింది.  పెళ్లయ్యాక రణ్‌బీర్ కపూర్, అలియా భట్ మొదటిసారిగా ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రలో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సక్సెస్‌తో మరోసారి ఈ  రొమాంటిక్ బాలీవుడ్ జంట  స్క్రీన్‌ను పంచుకోనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement