Jr NTR Special Guest For Brahmastra Pre Release Event - Sakshi
Sakshi News home page

Jr NTR: బ్రహ్మాస్త్ర గ్రాండ్‌ ఈవెంట్‌: ముఖ్య అతిథిగా యంగ్‌ టైగర్‌

Published Sat, Aug 27 2022 4:51 PM | Last Updated on Sat, Aug 27 2022 5:21 PM

Jr NTR Special Guest For Brahmastra Pre Release Event - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన షంషేరా బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో తన తర్వాతి సినిమా బ్రహ్మాస్త్ర మీదే బోలెడాశలు పెట్టుకున్నాడీ హీరో. రణ్‌బీర్‌తో పాటు ఆలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం 'బ్రహాస్త్ర: మొదటి భాగం శివ' పేరిట సెప్టెంబర్‌ 9న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌కు రెడీ అవుతోంది చిత్రయూనిట్‌. అందులో భాగంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఖరారు చేశారు. సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్‌ వేడుక జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రహాస్త్ర చిత్రయూనిట్‌ ఓ స్పెషల్‌ మీడియాను రిలీజ్‌ చేసింది.

చదవండి: ఆంటీ లొల్లి.. అనసూయకు సపోర్ట్‌ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్‌
బిగ్‌బాస్‌ పింకీ పెళ్లి? యాంకర్‌ రవి ఏమన్నాడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement