Mouni Roy Discharged From Hospital After 9 Days - Sakshi
Sakshi News home page

Mouni Roy: 9 రోజులుగా ఆస్పత్రిలోనే.. నీలా నాకు ఎవరూ లేరు: మౌనీ రాయ్ ఎమోషనల్

Jul 23 2023 12:59 PM | Updated on Jul 23 2023 3:07 PM

Mouni Roy discharged from hospital after 9 days  - Sakshi

మౌనీ రాయ్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నాగిని సీరియల్. ఆ సీరియల్‌తోనే ఎక్కువ ఫేమ్‌ను తెచ్చుకుంది.  గతేడాది బాలీవుడ్‌లో ఆమె నటించిన బ్రహ్మస్త్ర చిత్రం మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమాలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది బాలీవుడ్ భామ మౌనీ రాయ్. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది.  ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నానని పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

(ఇది చదవండి: 'బేబీ' ఫేమ్‌ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌.. హీరో ఎవరంటే

మౌనీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' 9 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నా.  నాకు తెలిసిన దానికంటే లోతైన ఆలోచనలతో మునిగిపోయా. ప్రస్తుతం నేను ఇంటికి తిరిగి వచ్చా.  నెమ్మదిగా కోలుకుంటున్నా.  కానీ బాగానే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.  నా మేలు కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి నా స్నేహితులకు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు.  మీలాగా నన్ను చూసుకునే వారు ఎవరూ లేరు.  నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.' అంటూ తన భర్త నంబియార్‌పై ప్రశంసలు కురిపించింది. అయితే తన అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

(ఇది చదవండి: నిజంగానే అతీంద్రియ శక్తులున్నాయా?.. అయితే ఈ సినిమా చూడాల్సిందే!) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement