మూవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్. మల్టీప్లెక్సుల్లో కేవతం 75 రూపాయలకే సినిమా చూసే ఛాన్స్ రాబోతుంది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో 250 నుంచి 400వరకు( పెద్ద సినిమాలకు) టికెట్ రేటు ఉంటుంది. సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ఈ అవకాశం కల్పిస్తోంది. దీంతో ఆ ఒక్కరోజు అన్ని మల్టీప్లెక్స్‌లలో రూ.75కే అన్ని సినిమాలు చూడొచ్చు.
అన్ని ప్రధాన నగరాల్లోని PVR, INOX, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటుకే టికెట్లు లభించనున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రీనింగ్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఉంది. ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3డీలో వీక్షించొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ ధర రూ. 330గా ఉంది. సో నేషనల్ మూవీ డే రోజున కేవలం 75 రూపాయలకే ఈ భారీ బడ్జెట్ మూవీని చూసే ఛాన్స్ కొట్టేయండి.
Comments
Please login to add a commentAdd a comment