Adipurush Movie: Netizens Trolls On Makers For Again Reduced Ticket Price, Deets Inside - Sakshi
Sakshi News home page

Adipurush Movie: ఆదిపురుష్‌ మేకర్స్‌ బంపర్‌ ఆఫర్‌.. ఈ తలనొప్పి మాకొద్దంటున్న జనం

Published Mon, Jun 26 2023 1:27 PM | Last Updated on Mon, Jun 26 2023 1:47 PM

Adipurush Movie: Netizens Troll Makers for Further Reducing Ticket Prices - Sakshi

భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్‌ హవా చప్పున చల్లారిపోయింది. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తర్వాత మాత్రం మరో నూరు కోట్లు రాబట్టేందుకు వారం రోజులు తీసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద దారుణ కలెక్షన్లు అందుకుంటున్న ఈ సినిమాను ఎలాగైనా గండం గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే టికెట్‌ రేట్లు తగ్గిస్తూ వస్తున్నారు.

తొలుత జూన్‌ 21న ఆదిపురుష్‌ త్రీడీ టికెట్‌ రేట్లను రూ.150కే అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించింది చిత్రయూనిట్‌. అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే ఆ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని చెప్పింది. కానీ ఈ ఎత్తు పారలేదు. ఆదిపురుష్‌పై వస్తున్న వ్యతిరేకత కలెక్షన్లకు గండి కొడుతూనే ఉంది. దీంతో తాజాగా మరోసారి టికెట్‌ రేట్లు తగ్గించారు. కేవలం 112 రూపాయలకే ఆదిపురుష్‌ 3D టికెట్లు బుక్‌ చేసుకోండి అని ప్రకటించారు. సోమవారం నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

ఆదిపురుష్‌ మేకర్స్‌ ప్రకటించిన బంపర్‌ ఆఫర్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'మీరు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా చూడం', 'మీరు టీజర్‌ రిలీజ్‌ చేసినప్పుడే సినిమాను ఎలా భ్రష్టుపట్టించారో అర్థమైంది', 'సినిమాకు వెళ్లి తలనొప్పి తెచ్చుకునేకన్నా ఇంట్లో ఉండటం నయం', 'అరె.. బాబూ.. రూపాయికి టికెట్లు ఇచ్చినా సరే చూసేదే లేదు', 'ఓం రౌత్‌ హనుమాన్‌ కోసం థియేటర్‌లో ఒక సీటు వదిలేయమన్నాడు, కాబట్టి మనమంతా వానర సేన కోసం సినిమా హాల్‌ అంతా వదిలేద్దాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

చదవండి: ఆదిపురుష్‌ 2 ఉందా? బూతులు మాట్లాడుతున్న జనాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement