Telangana Government Gives Permission To Increase Adipurush Movie Tickets Price - Sakshi
Sakshi News home page

Adipurush Movie: ఆ రోజుల్లో టికెట్ల రేట్లు పెంపు.. 'ఆదిపురుష్' చిత్రానికి అనుమతి!

Published Tue, Jun 13 2023 7:12 PM | Last Updated on Tue, Jun 13 2023 8:18 PM

Telangana Government Gives Permission To Increase Adipurush Tickets - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన మైథలాజికల్‌ చిత్రం.. 'ఆదిపురుష్‌'.  ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్ భారీ అంచనాలు పెంచగా..  ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

( ఇది చదవండి: 'ఆదిపురుష్‌' సెన్సార్‌ పూర్తి.. రన్‌ టైమ్‌ కాస్త ఎక్కువే)

తాజాగా ఈ చిత్ర బృందానికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  అది పురుష్ సినిమా టిక్కెట్స్ రేటు పెంచుకునేందుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌కు 50 రూపాయల పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ చిత్రం రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. 

(ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement