Kriti Sanon Praises Prabhas At Adipurush Trailer Launch, Says He's As Simple As Prabhu Ram - Sakshi
Sakshi News home page

Kriti Sanon On Prabhas: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్‌ కృతిసనన్‌.. కామెంట్స్‌ వైరల్‌

Published Wed, May 10 2023 11:54 AM | Last Updated on Wed, May 10 2023 12:45 PM

Kriti Sanon Praises Prabhas At Adipurush Trailer Launch - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకుంటుంది. టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్‌ ట్రైలర్‌తో మాత్రం ప్రశంసలు అందుకుంటున్నారు. టీజర్‌కు వంద రెట్లు ట్రైలర్‌ మెరుగ్గా ఉందని, విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు.

రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీత పాత్రలో నటించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు.ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్‌లో ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ కృతిసనన్‌ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది.

రాముడిలాగే ప్రభాస్ చాలా మంచివాడని, అతను చాలా సింపుల్‌ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆదిపురుష్‌ షూటింగ్‌ సమయంలోనే ప్రభాస్‌-కృతిసనన్‌ ప్రేమలో పడ్డారని, త్వరలోనే తమ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ అనౌన్స్‌ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కృతిసనన్‌ ప్రభాస్‌పై చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement