Kriti Sanon talks about Prabhas and his 'expressive eyes' amid dating rumours - Sakshi
Sakshi News home page

Kriti Sanon: ఆ ప్లేస్‌లో ప్రభాస్‌ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్

Published Wed, Jun 14 2023 1:18 PM | Last Updated on Fri, Jun 16 2023 4:53 PM

Kriti Sanon about Prabhas expressive eyes amid dating rumours - Sakshi

బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ  చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్‌తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది.

(ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్)

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ భామ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం  ఎలా ఉందని కృతి సనన్‌ను ప్రశ్నించగా వాటికి సమాధానమిచ్చింది ముద్దుగుమ్మ. 

కృతి మాట్లాడుతూ.. 'ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారిని గౌరవిస్తారు. మొదట్లో అతను సిగ్గుపడేవాడు. నేను తొలిసారి నటించిన తెలుగు సినిమా గురించి మాట్లాడటం ప్రారంభించా. మనకు రాని భాషలో నటించడం చాలా కష్టమని నాకు తెలియదు అని చెప్పా.  ఆ తర్వాతే ప్రభాస్ నాతో మాట్లాడారు. నేను మామూలుగానే మాట్లాడేదాన్ని. కానీ ప్రభాస్ చాలా ఒపెన్‌గా ఉండేవారు. ఆయన చాలా సైలెంట్‌గా తన పని చేసుకోపోయేవారు. ప్రభాస్ కళ్లతోనే తన భావాలను వ్యక్తం చేస్తాడు. ఆదిపురుష్‌లో రాఘవగా ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేను.' అని అన్నారు. గత కొంతకాలంగా కృతి, ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. 
- ఐవీవీ సుబ్బరాజు

(ఇది చదవండి : షూటింగ్‌లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement