AP Govt Green Signal To Adipurush Movie Ticket Price Hike - Sakshi
Sakshi News home page

Adipurush Movie: ఆదిపురుష్‌ టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Jun 14 2023 5:51 PM | Updated on Jun 14 2023 6:36 PM

AP Government Green Signal to Adipurush Movie Ticket Price Hike - Sakshi

అన్ని థియేటర్స్‌లోనూ ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే పది రోజుల వరకు మాత్రమే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, హీరోయిన్‌ కృతీ సనన్‌ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆదిపురుష్‌ సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అన్ని థియేటర్స్‌లోనూ ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే పది రోజుల వరకు మాత్రమే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.

ఇకపోతే అటు తెలంగాణ సర్కార్‌ కూడా టికెట్‌ రేట్ల పెంపునకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే! మొదటి మూడు రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్స్‌కు రూ.50 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది.

చదవండి: ఆదిపురుష్‌ టికెట్‌ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
ఆదిపురుష్‌ మరికొద్ది గంటల్లో రిలీజ్‌.. ప్రచారం ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement