మరో రెండు రోజుల్లో థియేటర్లలో ఆదిపురుష్ సందడి చేయనుంది. జూన్ 16వ తేదీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి నుంచే అటు ర్యాలీలు, ఇటు భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. వీళ్ల రచ్చతో సోషల్ మీడియాలో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్(#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది.
మరోపక్క అడ్వాన్స్ బుకింగ్స్ కూడా షురూ కావడంతో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి సినిమా చూసేందుకు సమాయత్తమయ్యారు ఫ్యాన్స్. టికెట్ రేటు ఎంతున్నా సరే తగ్గేదే లేదంటూ ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి! అయితే కొన్ని చోట్ల టికెట్ల రేట్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయట.
ఢిల్లీ ఆంబియన్స్ మాల్‌లోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్‌లో ఆదిపురుష్ టికెట్ ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 2,200 రూపాయలు. ఇదేదో త్రీడీ వర్షన్‌కు అనుకునేరు. కేవలం 2డీ ఫార్మాట్‌కు మాత్రమే! ఢిల్లీలోని పీవీఆర్: వేగాస్ లగ్జ్ థియేటర్‌లో కూడా ఒక్క టికెట్ ధర రెండు వేల రూపాయలుగా ఉంది. ఇంత ధర పలుకుతున్నా సరే ఫ్యాన్స్ ఎగబడి టికెట్స్ కొనడంతో అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ అవుతుండటం విశేషం.
హైదరాబాద్‌లో త్రీడీ వర్షన్ టికెట్ ధర విషయానికి వస్తే కొన్ని చోట్ల రూ.325 నుంచి మొదలవుతుండగా మరికొన్ని చోట్ల రూ.400గా ఉంది. ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించారు. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment