రియల్ లైఫ్ జోడీ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజవగా దీనిపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అంతేకాదు ఏకంగా బ్రహ్మాస్త్ర మూవీని నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇందుకు వాళ్లు చెప్పిన ప్రధాన కారణం.. రణ్‌బీర్ కపూర్ కాళ్లకు షూలు వేసుకని ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా షూలతోనే గుడిగంట మోగించాడు. దీంతో ఈ సీన్‌పై ఓ వర్గం ఒంటికాలిపై లేచింది. ఆలయంలోకి చెప్పులు వేసుకుని ఎలా వెళ్తారంటూ మండిపడింది. తాజాగా ఈ వివాదంపై బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందించాడు.
'రణ్‌బీర్ కాళ్లకు షూలు వేసుకుని గుడిగంట మోగించడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక భక్తుడిగా, సినిమా దర్శకుడిగా అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రణ్‌బీర్ కాళ్లకు షూలు వేసుకుని ఆలయంలో అడుగుపెట్టలేదు. దుర్గాదేవి పూజామండపంలోకి వెళ్లాడు. 75 ఏళ్లుగా మా కుటుంబం దుర్గా పూజను నిర్వహిస్తోంది. నాకున్న అనుభవం కొద్దీ చెప్తున్నా.. మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకునే వెళ్తాం. కానీ అమ్మవారి ముందుకు వెళ్లేటప్పుడు మాత్రం వాటిని పక్కన విడిచేసి దర్శనం చేసుకుంటాం. అక్కడ జరిగిందిదే. భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకే ఈ సినిమా తీశాం. అంతే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు' అని దర్శకుడు స్పష్టం చేశాడు.
చదవండి: పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ?
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
Comments
Please login to add a commentAdd a comment