బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ బ్రహ్మస్త్ర. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధించింది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ చిత్రం సందడి చేస్తోంది.
(చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్)
అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించడమే కాకుండా. రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు అయాన్ ముఖర్జీ గతంలోనే ప్రకటించారు. త్వరలోనే బ్రహ్మస్త్ర పార్ట్-2 షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ -2పై సోషల్ మీడియాలో పలు రకాల రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దేవ్ పాత్రలో పలువురు హీరోలు నటించబోతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. దేవ్ పాత్రలో రణవీర్, యశ్, హృతిక్ రోషన్ వంటి హీరోలు నటిస్తున్నారని ఇప్పటికే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ పేరును సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లైగర్ హీరో విజయ్ దేవరకొండను బ్రహ్మాస్త్ర-2లో తీసుకోవడానికి నిర్మాత ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ వార్తలపై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందించారు. బ్రహ్మాస్త్ర సినిమాలో దేవ్ పాత్రపై వస్తున్న హైప్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇటీవల హృతిక్, రణవీర్, యశ్ నటిస్తున్నారని వార్లలొచ్చాయి. అందుకే ఈ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని చెప్పిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ అయాన్ వ్యంగ్యంగా మాట్లాడారు. దేవ్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే విషయంలో కూడా ఏమాత్రం వాస్తవం లేదన్నారు. డైరెక్టర్ కామెంట్స్‌తో దేవ్ పాత్రపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment