సైంటిస్ట్‌ షారుక్‌ | Shah Rukh Khan plays a scientist in Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

సైంటిస్ట్‌ షారుక్‌

Published Mon, Mar 16 2020 5:43 AM | Last Updated on Mon, Mar 16 2020 5:43 AM

Shah Rukh Khan plays a scientist in Ranbir Kapoor - Sakshi

షారుక్‌ ఖాన్‌

‘బ్రహ్మాస్త్ర’ కోసం సైంటిస్ట్‌గా మారారు షారుక్‌ ఖాన్‌ . రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌  ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ , నాగార్జున, డింపుల్‌ కపాడియా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్‌  సైంటిస్ట్‌గా ఓ గెస్ట్‌ రోల్‌ చేశారని బాలీవుడ్‌ సమాచారం. షారుక్‌ సన్నివేశాలతోనే ఈ చిత్రం మొదలవుతుందట. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వాయిదా పడింది. మరోవైపు ‘జీరో’ (2018) చిత్రం తర్వాత షారుక్‌ ఖాన్‌  హీరోగా నటించే చిత్రంపై ఇప్పటివరకు సరైన స్పష్టత రాలేదు. తమిళ దర్శకుడు అట్లీతో ఓ హిందీ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement