‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌: అలియా,రణ్‌బిర్‌లతో నాగార్జున | Nagarjuna Akkineni Wraps Up Brahmastra Movie Shooting | Sakshi
Sakshi News home page

‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌: అలియా,రణ్‌బిర్‌లతో నాగార్జున

Published Tue, Feb 16 2021 4:47 PM | Last Updated on Tue, Feb 16 2021 5:53 PM

Nagarjuna Akkineni Wraps Up Brahmastra Movie Shooting - Sakshi

బాలీవుడ్‌ కపుల్‌ రణ్‌బిర్‌ కపూర్‌, అలియా భట్‌లు మొదటిసారిగా జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. గతేడాది డిసెంబర్‌లో విడుదల కావలసిన ఈ మూవీ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇక షూటింగ్‌ తిరిగి ప్రారంభం కావడంలో ఇటీవల ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్‌లో టాలీవుడ్‌ ‘కింగ్‌’ నాగార్జున అక్కినేని కూడా పాల్గొన్నాడు. ఇందులో ఆయన ఓ కిలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆయన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి కావడంలో మంగళవారం ట్వీట్‌ చేశాడు. 

షూటింగ్‌ సెట్స్‌లో రణ్‌బిర్‌, అలియా, డైరెక్టర్‌తో కలిసి తీసుకున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘బ్రహ్మాస్త్ర’లో నా షూటింగ్‌ అయిపోయింది. రణ్‌బిర్‌, అలియాల వంటి నటులతో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం. ఇక ఆయాన్‌ ముఖర్జీ సృష్టించిన అత్యుత్తమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు వేచి ఉండలేకపోతున్న’ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. అలాగే అలియా భట్‌ కూడా ట్వీట్‌ చేస్తూ.. ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున సార్‌. ఆయనతో కలిసి నటించడం నిజంగా అరుదైన గౌరవంగా ఫీల్‌ అవుతన్న.

షూటింగ్‌ సెట్స్‌లో మంచి జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్‌’ అంటూ రాసుకొచ్చింది. దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రం మూడు భాగాల ఫాంటసీ అడ్వెంచర్ ఫ్రాంచైజీగా తెరకెక్కనుంది. ఇందులో రణ్‌బిర్‌ శివ పాత్రలో, అలియా ఇషాగా లీడ్‌ రోల్‌లు పోషిస్తుండగా.. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున అక్కినేని, మౌని రాయ్‌, డింపుల్‌ కాపాడియాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరపుకుంటోంది. ఇక త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది.

(చదవండి: ఆ సీన్‌లో ఆడ ఏనుగులనే ఎందుకు వాడారో తెలుసా?)
                  (మరోసారి నాగ్- పూరీ కాంబో.. డిఫరెంట్ స్టోరీ రెడీ!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement