టాలీవుడ్ స్టార్ హీరో ‘కింగ్’ నాగార్జున్ కీ రోల్ పోషించిన బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్రం. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేయగా చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్ధయిన సంగతి తెలిసిందే. భారీ ఖర్చుతో ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడంతో మేకర్స్ భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. దీని కోసం మేకర్స్ దాదాపు రూ. 2.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే..
ఈ కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మేకర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఖర్చంతా వృథా అయిపోయిందని మేకర్స్ ఆవేవదన వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక చేసేదేం లేక అప్పటికప్పుడు రూ. 10 లక్షల ఖర్చుతో పార్క్ హయత్‌లో ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లు చేశారట. అయితే గణపతి నవరాత్రి ఉత్సవాల కారణంగా సెక్యూరిటీ ఇవ్వమలేమని చెప్పి నగర పోలీసులు చెప్పడంతో ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది. కాగా బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, నాగిని బ్యూటీ మౌని రాయ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment