![Amitabh Bachchan Pays 70 Crores Taxes - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/13/amitab.jpg.webp?itok=ZOPN2NV8)
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రేజ్ ఏపాటితో అందరికీ తెలిసిందే. వెండితెరపై ఇప్పటికీ అమితాబ్ కనిపిస్తే.. అభిమానులు పండుగ చేసుకుంటారు. అమితాబ్ ప్రస్తుతం సినిమాలు, ప్రకటనలతో బిజీగా ఉన్నారు. అయితే అమితాబ్ ఆదాయమే కాదు ఆయన కట్టే పన్నులు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.
2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ.. అమితాబ్ 70కోట్ల రూపాయలను పన్నుగా చెల్లించినట్లు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. అమితాబ్.. ముజఫర్‌నగర్‌లోని 2084మంది రైతుల రుణాలను చెల్లించారు.. అంతేకాకుండా పుల్వామా దాడిలో అమరులైన దాదాపు 40 మంది జవాన్ల కుటుంబాలకు పదిలక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది అమితాబ్ బాద్లా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఇదే ఏడాదిలో బ్రహ్మాస్త్ర, సైరా సినిమాలతో సందడి చేయనున్నారు. ఈ ఏడాదిలోనే తొలిసారిగా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment