tax paid
-
ఐటీ రిఫండ్స్ రూ.43,991 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిఫండ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూలై 26 వరకూ రూ.43,991 కోట్లని ఆ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్స్ రూ.13,341 కోట్లని , కార్పొరేట్ పన్ను రిఫండ్స్ రూ.30,650 కోట్లని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 26 మధ్య 21.03 లక్షల మందికి ఈ రిఫండ్స్ జరిగినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. వీరిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగంలో 19,89,912 మంది ఉండగా, కార్పొరేట్ కేసులు 1,12,567 ఉన్నాయని తెలిపింది. -
70కోట్ల ట్యాక్స్ కట్టిన మెగాస్టార్!
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రేజ్ ఏపాటితో అందరికీ తెలిసిందే. వెండితెరపై ఇప్పటికీ అమితాబ్ కనిపిస్తే.. అభిమానులు పండుగ చేసుకుంటారు. అమితాబ్ ప్రస్తుతం సినిమాలు, ప్రకటనలతో బిజీగా ఉన్నారు. అయితే అమితాబ్ ఆదాయమే కాదు ఆయన కట్టే పన్నులు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ.. అమితాబ్ 70కోట్ల రూపాయలను పన్నుగా చెల్లించినట్లు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. అమితాబ్.. ముజఫర్నగర్లోని 2084మంది రైతుల రుణాలను చెల్లించారు.. అంతేకాకుండా పుల్వామా దాడిలో అమరులైన దాదాపు 40 మంది జవాన్ల కుటుంబాలకు పదిలక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది అమితాబ్ బాద్లా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఇదే ఏడాదిలో బ్రహ్మాస్త్ర, సైరా సినిమాలతో సందడి చేయనున్నారు. ఈ ఏడాదిలోనే తొలిసారిగా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. -
పెద్దనోట్లతో పన్ను చెల్లించొచ్చు
అనంతపురం : వాణిజ్య పన్నుల శాఖకు సంబం«ధించి అన్ని ఆర్థిక లావాదేవీలు పెద్దనోట్లతో (పాత రూ. 1000, 500) చెల్లించవచ్చని, ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారని, అసిస్టెంట్ కమిషనర్ శేషాద్రి తెలిపారు. పన్నులు, అపరాధ రుసుం, సీఫీజు, వడ్డీ తదితర మొత్తాలను వ్యాపారులు పాత నోట్లతోనే చెల్లించవచ్చని చెప్పారు. చలానా ద్వారా నేరుగా బ్యాంకులో్ల చెల్లింవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.