ఛాన్సులు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారు: గాలిపటం హీరోయిన్‌ | Erica Fernandes: Nepotism Happens, Replaced In Bollywood Movies | Sakshi
Sakshi News home page

బాడీ షేమింగ్‌.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్‌

Published Mon, Apr 1 2024 5:01 PM | Last Updated on Mon, Apr 1 2024 6:09 PM

Erica Fernandes: Nepotism Happens, Replaced In Bollywood Movies - Sakshi

ఎరికా ఫెర్నాండేజ్‌.. సీరియల్‌ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మోస్ట్‌ గ్లామరస్‌ బుల్లితెర నటిగా అవార్డులు అందుకున్న ఈ బ్యూటీ గాలిపటం, డేగ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. హిందీలో 'బబ్లూ హ్యాపీ హై' అని ఒకే ఒక్క సినిమా చేసింది. నెపోటిజం వల్ల తనకు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలే రాకుండా పోయాయని, వచ్చిన అవకాశాలను కూడా సెలబ్రిటీ కిడ్స్‌ ఎగరేసుకుపోయారని చెప్తోంది. 

ఆడిషన్‌కు వెళ్లేదాన్ని
తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ సినిమాకు సంతకం చేశాను. రెండు, మూడు రోజులు షూటింగ్‌ అయ్యాక నన్ను తీసేశారని తెలిసింది. అప్పుడే నాకు బాలీవుడ్‌లో ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. చాలాసార్లు ఆడిషన్‌కు వెళ్లాను. ఆల్మోస్ట్‌ ఓకే అయిపోయిందనుకునే సమయంలో ఫేమస్‌ సెలబ్రిటీల కూతుర్లను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసేవారు. నన్ను పక్కన పెట్టేసేవారు. ఎంతో బాధేసేది. సినిమా అవకాశాల్లేనప్పుడు సీరియల్స్‌ చేశాను. మళ్లీ టీవీకి ఎందుకు వెళ్తున్నావని అడిగేవారు. ఏదైనా పనే అని నమ్మాను. సినిమా రోల్స్‌ అయినా, సీరియల్‌ పాత్రలయినా అన్నింటినీ అంతే గౌరవంగా స్వీకరించాను' అని చెప్పుకొచ్చింది.

ఆ తిరస్కరణల వల్లే
బాడీ షేమింగ్‌ గురించి మాట్లాడుతూ.. 'గతంలో నేను ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. బక్కపలుచగా ఉండటంతో చాలా ప్రాజెక్టుల్లో నాకు ఛాన్సులు వచ్చినట్లే వచ్చి చేజారాయి. ఆత్మనూన్యతకు లోనయ్యాను. కానీ ఆ తిరస్కరణ వల్లే నేను మరింత బలంగా తయారయ్యాను' అని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఎరికా 'లవ్‌ అధూర' అనే వెబ్‌ సిరీస్‌ చేసింది.

చదవండి:  వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement