యువతరానికి పండగే | 'Gaalipatam' to be released in August first week | Sakshi
Sakshi News home page

యువతరానికి పండగే

Published Thu, Jul 24 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

యువతరానికి పండగే

యువతరానికి పండగే

 దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టినా ఆకిహివా ప్రధాన పాత్రధారులు. నవీన్‌గాంధీ దర్శకుడు. ఆగస్ట్ తొలివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ -‘‘పేరుకు తగ్గట్టే విభిన్నంగా ఉంటుందీ సినిమా. యువతరం పండుగ చేసుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
 
 భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆది నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని చెప్పారు. ‘గాలిపటం’ తనకు ప్రత్యేకమైన సినిమా అని, సాంకేతికంగా ఈ సినిమా ఓ అద్భుతమని, తాను ఇష్టంగా చేసిన సినిమా ఇదని ఆది తెలిపారు. సంపత్‌నంది, ఆయన టీమ్ కలిసి అంకితభావంతో పనిచేసి, ఓ అందమైన అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారని నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్ వట్టికూటి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, నిర్మాణం: సంపత్‌నంది టీమ్ వర్క్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement