రైలులో జరిగే కథ! | Dega Romantic, love, action entertainer Movie | Sakshi
Sakshi News home page

రైలులో జరిగే కథ!

Published Tue, Nov 25 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

రైలులో జరిగే కథ!

రైలులో జరిగే కథ!

థాయిలాండ్ నుంచి మలేసియా వెళ్లే రైలు అది. ఆ రైలు ప్రయాణంలో జరిగే ఓ కథతో రూపొందిన చిత్రం ‘డేగ’. సుజీవ్, ఎరికా ఫెర్నాండెజ్ జంటగా జేవీ రామారావు సమర్పణలో స్వీయదర్శకత్వంలో కుమార్ రావెళ్ల నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కుమార్ రావెళ్ళ మాట్లాడుతూ -‘‘ఇది రొమాంటిక్, లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో తీసిన ఫైట్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. ధరణ్‌కుమార్ స్వరపరచిన పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘రంగ్ దే బసంతి’ ఫేం నరేశ్ అయ్యర్, కథానాయిక ఆండ్రియా ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పి.వి. రవికుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement