
సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న సినిమా అయినా సరే ఐదారు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇక కొంచెం పేరున్న నటీనటులతో సినిమా చేయాలంటే పది కొట్లకు పైనే అవుతుంది. ఒక్క హిట్ పడితే చాలు.. ఆ హీరోలో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువ 20 కోట్లు ఉండాల్సిందేనట. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. చాలా మంది హీరోలు కథలు వినడం కంటే ముందే.. తన రెమ్యునరేషన్, సినిమా బడ్జెట్ ఎంతో చెప్పమని అడుగుతున్నారట. తక్కువ బడ్జెట్ సినిమాలు చేయమని ముఖంపైనే చెప్పేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో అయితే తనతో సినిమా చేయాలంటే పాతిక కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సిందేనని కండీషన్ పెట్టాడట.
తాజాగా ఓ యంగ్ డైరెక్టర్, నిర్మాత మంచి కాన్సెప్ట్‌తో సదరు హీరోని సంప్రదించారట. కథ మొత్తం విన్నాక.. బడ్జెట్ ఎంత అని అడిగాడట. 10-15 కోట్లతో తీయ్యొచ్చని చెబితే..మినిమం 25 కోట్ల బడ్జెట్ పెడితేనే సినిమా చేస్తానని చెప్పాడట. తన రెమ్యునరేషన్‌గా రూ.10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశారట.
అయితే ఆ హీరోకి ఇటీవల ఒక్క హిట్ కూడా లేకపోవడం గమనార్హం. పైగా ఆయన నటించిన ఓ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయినా కూడా తన రెమ్యునరేషన్‌ని ఏమాత్రం తగ్గించలేదట. ఆ హీరో మార్కెట్ వ్యాల్యూ కూడా అంతగా లేదు. దీంతో సదరు నిర్మాత అంత బడ్జెట్ పెట్టలేనని చెప్పి బయటకు వచ్చాడట. వరుసగా ఫ్లాపులు వచ్చాయి కదా..తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఆ హీరోని సంప్రదిస్తే.. ఆయన పెట్టిన కండీషన్ చూసి సదరు నిర్మాత షాకయ్యారట. ఇలా చాలా మంది యంగ్ హీరోలు ఒక్క హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment