
Radhe Shyam Movie Meme: టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంస్థ అభివృద్ధికి, ప్రజారవాణాను జనాలకు మరింత దగ్గర చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు క్షేమంగా గమ్య తీరాలకు చేరుస్తుందంటూ మీమ్స్ వదులుతుండగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సజ్జనార్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్ కోసం వాడుకున్నారు.
ఈ మేరకు ఓ మీమ్ ట్వీట్ చేశారు. ఇందులో 'చాలా రోజుల తర్వాత కలిశాం, ఏదైనా టూర్ వెళదామా?' అని ప్రభాస్ అనగా 'వెళదాం కానీ, ఆర్టీసీ బస్సులోనే వెళదాం' అని పూజా హెగ్డే అంటుంది. 'ఎందుకు?' అని ప్రభాస్ ప్రశ్నించగా 'ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం- సుఖమయం' అని పూజా సమాధానం చెప్తున్నట్లుగా ఉంటుంది. దీనికి 'బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్' అని ఒక టైటిల్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ వైరల్‌గా మారింది. కాగా రాధేశ్యామ్ శుక్రవారం(మార్చి 11న) రిలీజవుతున్న విషయం తెలిసిందే!
#TSRTC బస్సులోనే వెళ్దాం అంటున్నా #RadheShyam Choose TSRTC & Encourage the #publictransport @TSRTCHQ @TV9Telugu @SakshiHDTV @ntdailyonline @News18Telugu @baraju_SuperHit @telugufilmnagar @Sreeram_singer @puvvada_ajay @Govardhan_MLA @TeluguBulletin @ChaiBisket @boxofficeindia pic.twitter.com/3QuEsYqN9i
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 10, 2022
Comments
Please login to add a commentAdd a comment