
దొంగలందరూ చెడ్డవారే కాదు.. దొంగల్లోనూ మంచివాళ్లుంటారు. అలాంటి ఓ వ్యక్తి కథే రాబిన్‌హుడ్ (Robinhood Movie). నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలవుతోంది.
విషయం బయటపెట్టిన డైరెక్టర్
శనివారం ఈ సినిమా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకీ కుడుముల (Venky Kudumula) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. రాబిన్‌హుడ్‌లో అదిదా సర్‌ప్రైజ్ అని ఓ ఐటం సాంగ్ ఉంది. కేతిక శర్మ (Ketika Sharma) ఈ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. అయితే అందర్నీ సర్‌ప్రైజ్ చేసిన మరో విషయం ఈ పాటలో కేతిక మల్లెపూల డ్రెస్‌తో కనిపించింది. అసలీ ఐడియా ఎవరిది? అని చాలామంది మదిలో మెదిలిన ప్రశ్న.
మల్లెపూల వెనక ఇదా మ్యాటర్
ఇదే ప్రశ్న దర్శకుడు వెంకీకి ఎదురైంది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అమ్మాయి ఇంట్రో స్పెషల్‌గా ఉండాలి. తన కాస్ట్యూమ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలని అని బాల్కనీలో ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎవరో వీధిలో మల్లెపూలు.. అని అమ్ముకుంటూ వెళ్లాడు. అది కాస్ట్యూమ్ చేస్తే ఎలా ఉంటుందా? అనుకున్నాను. అదే ఆచరణలో పెట్టాం అని చెప్పుకొచ్చాడు. అదిదా సర్‌ప్రైజు పాట విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాశాడు. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment