![Rahul Sipligunj Gives Clarity on Political Entry - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/26/Rahul-Sipligunj.jpg.webp?itok=UQB-GLzM)
ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై రాహుల్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు.
నేను ఆర్టిస్ట్‌ను.. రాజకీయాలకు నో
'నా మీద చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి.. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. రాజకీయ రంగప్రవేశం అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అన్ని పార్టీలలో ఉన్న అందరు నాయకులను నేను గౌరవిస్తాను. నేను ఒక ఆర్టిస్ట్‌ను.. అందరికీ వినోదం పంచడమే నా పని.. నా జీవితమంతా దానికే ధార పోస్తాను. అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు.
ఇది మరీ టూమచ్..
నేను సంగీతాన్నే నా కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏ పార్టీ నాకు ఆహ్వానాలు పంపలేదు. నేను కూడా ఎవరినీ ప్రత్యేకంగా కలవలేదు. దయచేసి ఈ రూమర్స్‌ను ఇక్కడితో ఆపేయండి..' అని నోట్ షేర్ చేశాడు. 'పుకార్లు రావడం సాధారణమే.. కానీ ఈ పుకారు మాత్రం మరీ టూమచ్‌గా ఉంది' క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడి రాజకీయ అరంగేట్రం అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది.
చదవండి: సిగరెట్, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం..
Comments
Please login to add a commentAdd a comment