'ఇది కేవలం గేమ్.. దయచేసి ఎవరూ పర్సనల్‌గా తీసుకోవద్దు'..విన్నర్‌ పోస్ట్ వైరల్! | Bigg Boss 2 Telugu Winner Kaushal Manda Reacts Over Fans Attacks On Cars At Annapurna Studio, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Kaushal Manda: కంటెస్టెంట్స్‌ వాహనాలపై దాడులు.. విన్నర్‌ సుధీర్ఘమైన పోస్ట్!

Published Mon, Dec 18 2023 4:30 PM | Last Updated on Mon, Dec 18 2023 5:08 PM

Bigg Boss Second Season Winner Kaushal responds on attacks On Cars  - Sakshi

టాలీవుడ్ అభిమానులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్‌-7 రియాలిటీ షో ఘనంగా ముగిసింది. ఈ సీజన్‌లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. అంతా బాగానే ఉన్నా.. అయితే ఈ షో ముగిసిన తర్వాత జరిగిన దాడులే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ వివాదంపై బిగ్‌బాస్‌ సీజన్-2 విన్నర్ కౌశల్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. బిగ్‌బాస్‌ షో కేవలం ఆట మాత్రమేనని అన్నారు. 

కౌశల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'బిగ్‌బాస్‌ షో కేవలం ఆట మాత్రమేనని.. వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈ షోలో ఒకరితో ఒకరు పోటీపడిన తర్వాత కూడా, కంటెస్టెంట్లు బయటకు వచ్చి మంచి స్నేహితులుగా ఉంటారు. గేమ్‌ను గెలవడానికి  వ్యూహాలు ఉపయోగించాల్సి రావచ్చు. కానీ చివరికీ ఇది కేవలం గేమ్ మాత్రమే.  ఎవరూ దీన్ని సీరియస్‌గా పరిగణించకూడదు. ఒక పోటీదారుడి అభిమానులు.. ఇతర పోటీదారులపై భౌతికపరమైన దాడి చేయడం నిరుత్సాహానికి గురిచేసింది. ఇటువంటి ప్రవర్తన ఈ షో ప్రదర్శనకు ప్రతికూలంగా మారుతుంది. ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీలను అందులో పాల్గొనకుండా చేసే ప్రమాదముంది. షో  ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ వారి జీవితాలతో ముందుకు సాగనివ్వాలి. వీరు భావోద్వేగాలు కలిగిన నిజమైన వ్యక్తులు. కేవలం ఆటలోని పాత్రలు మాత్రమే కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆడియన్స్‌గా మనం వారి వ్యక్తిగత జీవితాలను గౌరవిద్దాం' అని రాసుకొచ్చారు. 

కౌశల్ సోషల్ మీడియాలో రాస్తూ..' మనుషులుగా మన చర్యలే మన ప్రవర్తనను తెలియజేస్తాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు.. ముఖ్యంగా మనం అభిమానించే వారితో మాట్లాడేప్పుడు దీన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా ప్రేమ, మద్దతును చూపించడం సహజమే. కానీ సరిహద్దులను ఎప్పుడూ దాటకూడదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది మన ప్రేమను చూపుతున్న వ్యక్తి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యక్తులు తమకు కుటుంబాలు ఉన్నాయనే వాస్తవాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. వారు కూడా మీరు చేసే పనుల ద్వారా ప్రభావితమవుతారు. ప్రొఫెషనల్‌ నటులుగా ఇండస్ట్రీలో ఎదగడానికి, వారి కుటుంబాల కోసం ఎంతో కష్టపడి పని చేస్తారు. వారు అనుభవించే బాధ, ఒత్తిడిని అర్థం చేసుకోవడం, వారితో గౌరవంగా ఉండటం మాకు ఎంతో సహాయపడుతుంది. మనం మనుషుల్లా ప్రవర్తిద్దాం. మన పట్ల, మన కుటుంబాల పట్ల మనం కోరుకునే దయ, సానుభూతిని ఇతరులతోనూ చూపిద్దాం. ఈ చిల్లర పనుల వల్ల కలిగే బాధ నాకు తెలుసు. దయచేసి ఆపండి. వారి జీవితాలను సంతోషంగా జీవించనివ్వండి' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement