ప్రియుడితో బిగ్‌బాస్ విన్నర్ ఎంగేజ్‌మెంట్.. బ్రేకప్‌ అయిన కొన్ని నెలలకే! | Divya Agarwal gets engaged with boyfriend Apurva on her birthday | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ బ్యూటీ నిశ్చితార్థం.. బర్త్‌డే పార్టీలోనే ప్రపోజ్

Dec 6 2022 3:29 PM | Updated on Dec 6 2022 3:34 PM

Divya Agarwal gets engaged with boyfriend Apurva on her birthday - Sakshi

ప్రముఖ బిగ్‌బాస్ నటి, ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు ప్రపోజ్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది భామ. బర్త్‌డే పార్టీలోనే ప్రియుడు అపూర్వ పడ్గాంకర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. దీనికి సంబంధించిన తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె ఇటీవల మాజీ ప్రియుడు వరుణ్‌ సూద్‌తో కొన్ని నెలల క్రితమే విడిపోయింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

దివ్య అగర్వాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ఎప్పుడైనా నవ్వకపోవడం అనేది బహుశా ఎప్పటికీ జరగదు. జీవితం మెరుపులా మారుతోంది. ఈ ప్రయాణాన్ని పంచుకోవడానికి సరైన వ్యక్తిని ఎంచుకున్నా. అతని నా ప్రేమ ఎప్పటికీ వాగ్దానం. ఈ ప్రత్యేకమైన రోజుతో ఇకపై నేను ఒంటరిగా నడవను.' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది బిగ్‌బాస్ బ్యూటీ. దీంతో వెంటనే ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా పవిత్ర పునియా, మహి విజ్, రక్షందా ఖాన్, ఆర్తి సింగ్, జే భానుషాలి సహా అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. దివ్య పుట్టినరోజు వేడుకకు ఆమె సన్నిహితులు కూడా హాజరయ్యారు.

అపూర్వ పడ్గావ్కర్ ఎవరు?: అపూర్వ పడ్గాంకర్‌ ఒక  వ్యాపారవేత్త. అతను ముంబైలో నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. 

వరుణ్ సూద్‌తో డేటింగ్, బ్రేకప్: దివ్య ఇంతకుముందే వరుణ్ సూద్‌తో  రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ విడిపోయారు. తన భవిష్యత్తును వరుణ్‌తో కొనసాగించలేనని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. విడిపోయాక కూడా వరుణ్, దివ్య స్నేహితులుగా కొనసాగుతున్నారు. వరుణ్, దివ్య  2018లో డేటింగ్ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement