Birhday celebrations
-
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. భర్తలాగే సింపుల్‌గా చెప్పేసింది!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ జంటల్లో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈ మాజీ ప్రపంచసుందరి బాలీవుడ్ హీరోను పెళ్లాడింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు ఉంది. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీపై ఇటీవల పెద్దఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆ సమయంలో కేవలం ఆమె తన తల్లి, కుమార్తెతో మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా ఆరోజు అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్‌గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం అభిషేక్ ధరించడం లేదని తెలిసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు కూడా. అయినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్‌తో అలాంటి వాటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీరో, ఐశ్వర్యారాయ్ భర్త తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, సినీతారలు పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తమ అభిమాన హీరో బర్త్‌డే కావడంతో ఉదయం నుంచి బాలీవుడ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇదిగో మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ బర్త్ డే సందర్భంగా అభిషేక్ ఇలానే సింపుల్‌గా విషెస్ చెప్పారు. ఐశ్వర్య కూడా కాస్తా లేటైనా భర్తకు అదే తరహాలో విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన హీరోకు హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఈ ఒక్క పోస్ట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే గతేడాది పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో ఐశ్వర్యరాయ్ మెప్పించింది. అభిషేక్ సైతం గతేడాది గూమర్ చిత్రంతో అలరించాడు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
మిస్ యూ నందన.. సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ గాయని చిత్ర తన కుమార్తె జయంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కూతురికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఫోటోను షేర్ చేస్తూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ట్విటర్లో చిత్ర రాస్తూ.. 'స్వర్గంలో దేవ కన్యలతో వేడుకలు జరుపుకుంటున్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నేళ్లు గడిచినా నీ వయసు పెరగదు. నాకు దూరంగా ఉన్నా క్షేమంగా ఉన్నావని నాకు తెలుసు. నిన్ను ఎంతో మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ నందన.' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. కాగా.. 2011లో దుబాయ్‌లో ఉండగా నందన(8) స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించింది. pic.twitter.com/qHWWTOY09z — K S Chithra (@KSChithra) December 18, 2022 -
ప్రియుడితో బిగ్‌బాస్ విన్నర్ ఎంగేజ్మెంట్.. బ్రేకప్ అయిన కొన్ని నెలలకే!
ప్రముఖ బిగ్‌బాస్ నటి, ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు ప్రపోజ్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది భామ. బర్త్‌డే పార్టీలోనే ప్రియుడు అపూర్వ పడ్గాంకర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. దీనికి సంబంధించిన తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె ఇటీవల మాజీ ప్రియుడు వరుణ్ సూద్‌తో కొన్ని నెలల క్రితమే విడిపోయింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దివ్య అగర్వాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ఎప్పుడైనా నవ్వకపోవడం అనేది బహుశా ఎప్పటికీ జరగదు. జీవితం మెరుపులా మారుతోంది. ఈ ప్రయాణాన్ని పంచుకోవడానికి సరైన వ్యక్తిని ఎంచుకున్నా. అతని నా ప్రేమ ఎప్పటికీ వాగ్దానం. ఈ ప్రత్యేకమైన రోజుతో ఇకపై నేను ఒంటరిగా నడవను.' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది బిగ్‌బాస్ బ్యూటీ. దీంతో వెంటనే ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా పవిత్ర పునియా, మహి విజ్, రక్షందా ఖాన్, ఆర్తి సింగ్, జే భానుషాలి సహా అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. దివ్య పుట్టినరోజు వేడుకకు ఆమె సన్నిహితులు కూడా హాజరయ్యారు. అపూర్వ పడ్గావ్కర్ ఎవరు?: అపూర్వ పడ్గాంకర్ ఒక వ్యాపారవేత్త. అతను ముంబైలో నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. వరుణ్ సూద్‌తో డేటింగ్, బ్రేకప్: దివ్య ఇంతకుముందే వరుణ్ సూద్‌తో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ విడిపోయారు. తన భవిష్యత్తును వరుణ్‌తో కొనసాగించలేనని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. విడిపోయాక కూడా వరుణ్, దివ్య స్నేహితులుగా కొనసాగుతున్నారు. వరుణ్, దివ్య 2018లో డేటింగ్ ప్రారంభించారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
మాస్ డైరెక్టర్ బర్త్‌డే; మహేష్ విషెస్
డేరింగ్& డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎందరో హీరోలకు కెరీర్లో నిలిచిపోయే పాత్రలు సృష్టించి వారికి మంచి పేరును అందించారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హిరోలందరితో వర్క్ చేశారు ఆయన. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గెచ్చుకున్నారు. సోమవారం పూరి జగన్నాథ్ తన 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు బర్త్‌డే విషెస్ తెలుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ఫేవరేట్ డైరెక్టర్ పూరి జగనాథ్కు పుట్టిన రోజు శుబాకాంక్షలు, మీరెప్పుడూ సంతోషంగా ఉంటూ, ఇంకా మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను’. అని ట్వీట్ చేశారు. (నాగ్‌తో మూడోసారి?) Wishing one of my favourite directors @purijagan a very happy birthday!! Much happiness and success to you always! — Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2020 పోకిరి, బిజినెస్మెన్ వంటి రెండు సుపర్ హిట్ చిత్రాలను అందించి సుపర్‌స్టార్ మహేష్ రేంజ్‌ను పెంచారు. అలాగే హీరో రామ్ చరణ్ కూడా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరుత సినిమాతో రామ్ చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీనే. అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ. దర్శకుడు సురేందర్, రఘు కుంచె, అనిల్రావిఫూడి, నాగబాబు, బీఏ రాజు, నభా నటేష్ సహా పలువురు శుబాకాంక్షలు తెలిపారు. ఇక చివరగా ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో పాన్ ఇండియ చిత్రం ‘ఫైటర్’ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. (డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగలేదు) పూరి మరో చిత్రం ‘‘జనగణమన’ తన నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్, హీరో మహేశ్‌బాబుల కాంబినేషన్లో ‘జనగణమన’ అనే చిత్రం రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రాన్ని స్వయంగా పూరీయే ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే టాక్ వినిపించింది. ‘‘జనగణమన’ చిత్రం ఆగిపోలేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని తాజాగా పూరి జగన్నాథ్ పేర్కొనడంతో ఈ చిత్రం గురించి మళ్లీ హైప్పెరిగింది. (నా లైఫ్‌లైన్ రా నువ్వు..) -
‘రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా?’
వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు టీమిండియా సారథి విరాట్ కోహ్లికి బర్త్‌డే విషెస్ చెప్పిన కోచ్ రవిశాస్త్రిని నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆటాడేసుకుంటున్నారు. మంగళవారం జన్మదిన వేడుకలు జరపుకుంటున్న కోహ్లికి యావత్ క్రీడా ప్రపంచం బర్త్‌డే విషెస్ తెలిపింది. పనిలోపనిగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లికి బర్త్‌డే విషెస్ తెలిపాడు. అయితే అదే రవిశాస్త్రి కొంపముంచింది. ఎప్పట్నుంచో రవిశాస్త్రి అంటే పడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ‘బర్త్‌డే విషెస్ తెలిపావు కానీ.. సరైన హ్యాస్ ట్యాగ్ ఇవ్వడం మర్చిపోయావ్’, ‘గంగూలీ సర్.. మాకు(టీమిండియాకు) ఫిట్ కోచ్ కావాలి’, ‘రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా’, ‘ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. సకల భోగాలు అనుభవిస్తున్నావ్ రవి..’అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన అనంతరం ప్రధానంగా కోచ్ రవిశాస్త్రిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మిడిలార్డర్ బ్యాటింగ్ సమస్యను పరిష్కరించడంలో కోచ్ విఫలమయ్యాడంటూ విమర్శించారు. అంతేకాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై కూడా ధ్వజమెత్తుతున్నారు. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో రవిశాస్త్రి నిద్ర పోయాడంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. Happy birthday young man. Enjoy the break and have a kick ass year ahead. God bless. @imVkohli #HappyBirthdayVirat #KingKohli pic.twitter.com/3k27eTLDKr — Ravi Shastri (@RaviShastriOfc) November 5, 2019 -
కేఎల్ రాహుల్ బర్త్‌డే కేక్‌లో గేల్
-
మదర్‌థెరిస్సా జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
మరికల్ (ధన్వాడ) : మదర్‌థెరిస్సా జయంతిని పురష్కరించుకుని మరికల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రతిష్ఠించిన మదర్‌థెరిస్సా విగ్రహానికి ఆ సంఘం సభ్యులు గురువారం రంగులు వేయించారు. శుక్రవారం జరిగే జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.