స్టార్‌ జంటపై విడాకుల రూమర్స్.. భర్తలాగే సింపుల్‌గా చెప్పేసింది! | Sakshi
Sakshi News home page

Aishwarya Rai Bachchan: ఐశ్వర్య- అభిషేక్ జంటపై రూమర్స్.. బర్త్‌ డే పోస్ట్ వైరల్!

Published Mon, Feb 5 2024 7:37 PM

Aishwarya Rai Bachchan Shares Rare Photos With Abhishek Bachchan - Sakshi

బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ జంటల్లో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈ మాజీ ప్రపంచసుందరి బాలీవుడ్ హీరోను పెళ్లాడింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు ఉంది. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీపై ఇటీవల పెద్దఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆ సమయంలో కేవలం ఆమె తన తల్లి, కుమార్తెతో మాత్రమే ఉ‍న్నారు.

అంతేకాకుండా ఆరోజు అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్‌ కూడా చాలా సింపుల్‌గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం అభిషేక్ ధరించడం లేదని తెలిసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు కూడా. అయినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్‌తో అలాంటి వాటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.  
 
అయితే బాలీవుడ్ హీరో, ఐశ్వర్యారాయ్ భర్త తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, సినీతారలు పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తమ అభిమాన హీరో బర్త్‌డే కావడంతో ఉదయం నుంచి బాలీవుడ్‌ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. 

ఐశ్వర్యరాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇదిగో మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ బర్త్‌ డే సందర్భంగా అభిషేక్ ఇలానే సింపుల్‌గా విషెస్‌ చెప్పారు. ఐశ్వర్య కూడా కాస్తా లేటైనా భర్తకు అదే తరహాలో విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన హీరోకు హ్యాపీ బర్త్‌ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఈ ఒక్క పోస్ట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే గతేడాది పొన్నియిన్ సెల్వన్‌ చిత్రాలతో ఐశ్వర్యరాయ్ మెప్పించింది. అభిషేక్ సైతం గతేడాది గూమర్ చిత్రంతో అలరించాడు. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement