‘రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా?’ | Netizens trolled Ravi Shastri on Virat Kohli Birthday | Sakshi
Sakshi News home page

‘గంగూలీ సర్‌ టీమిండియాకు ఫిట్‌ కోచ్‌ కావాలి’

Published Tue, Nov 5 2019 5:11 PM | Last Updated on Tue, Nov 5 2019 5:38 PM

Netizens trolled Ravi Shastri on Virat Kohli Birthday - Sakshi

వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి బర్త్‌డే విషెస్‌ చెప్పిన కోచ్‌ రవిశాస్త్రిని నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఓ ఆటాడేసుకుంటున్నారు. మంగళవారం జన్మదిన వేడుకలు జరపుకుంటున్న కోహ్లికి యావత్ క్రీడా ప్రపంచం బర్త్‌డే విషెస్‌ తెలిపింది. పనిలోపనిగా టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి కూడా కోహ్లికి బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. అయితే అదే రవిశాస్త్రి కొంపముంచింది. ఎప్పట్నుంచో రవిశాస్త్రి అంటే పడని కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా అతడిని టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. 

‘బర్త్‌డే విషెస్‌ తెలిపావు కానీ.. సరైన హ్యాస్‌ ట్యాగ్‌ ఇవ్వడం మర్చిపోయావ్‌’, ‘గంగూలీ సర్‌.. మాకు(టీమిండియాకు) ఫిట్‌ కోచ్‌ కావాలి’, ‘రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా’, ‘ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. సకల భోగాలు అనుభవిస్తున్నావ్ రవి‌..’అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక టీమిండియా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన అనంతరం ప్రధానంగా కోచ్‌ రవిశాస్త్రిని టార్గెట్‌ చేస్తూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ సమస్యను పరిష్కరించడంలో కోచ్‌ విఫలమయ్యాడంటూ విమర్శించారు. అంతేకాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుపై కూడా ధ్వజమెత్తుతున్నారు. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో రవిశాస్త్రి నిద్ర పోయాడంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement