బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే ఆర్య, చందమామ, శంభో శివ భంభో వంటి సినిమాలు టక్కుమని కళ్లముందు మెదులుతాయి. తాజాగా అతడు ఓ షోలో తనకు పేరు తెచ్చిన సినిమాలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. 'సుకుమార్ గారు ఆర్య ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్లాను. వెంటనే ఓకే చేశారు. అయితే ఆ సినిమాలో నాది నెగెటివ్ పాత్ర కావడంతో చేయనని చెప్పేశాను. కానీ వాళ్లందరూ నాకు సర్ది చెప్పడంతో చివరికి ఒప్పుకున్నాను. అల్లు అర్జున్ ఆర్య సినిమా సమయంలో ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు.
ఆర్య తర్వాత మల్టీస్టారర్ సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చేసుకుంటూ పోయాను. కానీ చందమామ సినిమా చేయడానికి చాలా భయపడ్డాను. డైరెక్టర్ కృష్ణవంశీ గారు చందమామ సినిమా కోసం ఆడిషన్ చేశారు. రాఖీ సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్ చెప్పమని అడిగారు. నేను చెప్పిన తీరు ఆయనకు అంతగా నచ్చలేదు. ఆ విషయం అర్థమైన నేను ఈ సినిమాలో నటించే ఛాన్స్ రాదని ఫిక్సయ్యాను.
కానీ కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని ఫోన్ కాల్ వచ్చింది. అపనమ్మకంగానే సెట్స్‌కు వెళ్లేవాడిని. షూటింగ్ జరుగుతున్నా నాకు నమ్మకం కలగలేదు. అసలు నన్ను ఈ సినిమాలో ఉంచుతారా? మధ్యలోనే తీసేస్తారా? అనుకుంటూనే చిత్రీకరణ పూర్తి చేశాను. తీరా సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. చందమామ సక్సెస్ మీట్‌కు వెళ్లేటప్పుడు కృష్ణవంశీ పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి అందరితో కలిసిపోవాలి. లేదంటే నీలో ఉన్న ప్రతిభ ఎవరికీ తెలియకుండా పోతుంది అని చెప్పారు' అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు శివబాలాజీ.
చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్, 10 సెకన్లలో జీవితమంతా..
బలవంతంగా బంధంలో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే నయం: సదా
Comments
Please login to add a commentAdd a comment