ఉరితాడు బిగుసుకున్నా షూటింగ్ ఆపలేదు! | TV actor Prince Narula narrowly escaped from danger scene | Sakshi
Sakshi News home page

ఉరితాడు బిగుసుకున్నా షూటింగ్ ఆపలేదు!

Published Sat, Nov 19 2016 11:26 AM | Last Updated on Sat, Sep 15 2018 4:22 PM

ఉరితాడు బిగుసుకున్నా షూటింగ్ ఆపలేదు! - Sakshi

ఉరితాడు బిగుసుకున్నా షూటింగ్ ఆపలేదు!

న్యూఢిల్లీ: దాదాపు రెండు వారాల కిందట సినిమా షూటింగ్‌లో ఇద్దరు స్టంట్ మాస్టర్స్ చనిపోయారు. అయితే సరిగ్గా అలాంటి తరహాలోనే ఓ ప్రమాదం జరిగినా చివరికి ఆ నటుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మెడకు నిజంగానే ఉరితాడు బిగుసుకున్నా షూటింగ్ మాత్రం ఆపలేదట. ఆ వివరాలిలా ఉన్నాయి.. టీవీ నటుడు, బిగ్ బాస్ షో మాజీ విన్నర్ అయిన ప్రిన్స్ నరుల 'బాదో బహు' అనే షోలో నటిస్తున్నాడు. అయితే ఓ సన్నివేశంలో భాగంగా అతడు ఉరివేసుకున్నట్లు నటించాలి. షో యూనిట్ అంతా పక్కా ప్లాన్ చేసుకున్నారు. సీన్ షూటింగ్ చేస్తున్నారు.

ఇంతలో ఓ చైర్ ఎక్కిన బుల్లితెర నటుడు ప్రిన్స్ తన మెడకు ఉరితాడు బిగించుకున్నాడు. అయితే పొరపాటున ప్రిన్స్ నరుల తాను నిల్చున్న చైర్‌ను పక్కకు తన్నేశాడు. ఇక చూడండీ.. మెడకు తాడు బిగుసుకుపోయి అరవడం మొదలుపెట్టాడు. ఆ వెంటనే యూనిట్ వాళ్లు ప్రిన్స్ వద్దకువెళ్లి మెడకు ఉన్న తాడును తొలగించారు. ఆ నటుడి మెడకు స్వల్పగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ఘటనపై నటుడు ప్రిన్స్ నరులా మాట్లాడుతూ.. 'నా కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో నిజంగానే చాలా భయపడ్డాను. మెడకు తాడు ఉన్నా కూడా డైరెక్టర్ కట్ చెప్పకుండా షూటింగ్ కంటిన్యూ చేశాడు. ఆ సీన్ చూస్తే అభిమానులు థ్రిల్ అవుతార' అని బిబ్ బాస్ మాజీ విన్నర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement