
బిగ్‌బాస్ షో ఇప్పుడిది టెలివిజన్ రంగంలో ఒక సంచలనాత్మక షో. నాలుగున్నర నెలలపాటు సాగిన ఈ షోలో కంటెస్టంట్లు హోరాహోరిగా పాల్గొన్నారు.
బిగ్‌బాస్ షో ఇప్పుడిది టెలివిజన్ రంగంలో ఒక సంచలనాత్మక షో. హిందీలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఈ షోను తెలుగులో కూడా ప్రారంభించారు. తాజాగా, గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన హిందీ బిగ్‌బాస్-14 షోకు కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు. నాలుగున్నర నెలలపాటు సాగిన ఈ షోలో కంటెస్టంట్లు హోరాహోరీగా తలపడ్డారు. అయితే గ్రాండ్ ఫినాలెలో రుబీనా దిలైక్ ట్రోఫితోపాటు, 36 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. దీనిలో రాహుల్ వైద్య రన్నరప్‌గా నిలిచాడు.
కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఎప్పటికప్పుడు కొత్త టాస్క్‌లు ఇస్తూ వారిని ఉత్సాహపరుస్తూ ఉండటం, కొత్తవారితో కలసి ప్రయాణం చేయడం, విలాసవంతమైన సౌకర్యాలకు దూరంగా ఉండటం వంటివి ఎన్నో ఈహౌస్‌లో చోటు చేసుకున్నాయి. కాగా, ఫైనల్ పాంచ్‌లో రుబినా దిలైక్, రాహుల్ వైద్య, అలీగొని, నిక్కితంబొలి, రాఖీ సావంత్ చేరుకున్నారు. వారికి హోస్ట్ సల్మాన్ ఖాన్ 14 లక్షలు తీసుకొని ఇంటినుంచి వెళ్లిపోయే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవరికైతే ఇష్టమో వారు 30 సెకన్లలోపు బజర్ మోగించాలని తెలిపాడు.
అయితే ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకుని రాఖీసావంత్ రూ. 14లక్షలను తీసుకొని హౌజ్ నుంచి వెళ్లిపొతున్నట్లు తెలిపారు. ఆమె తర్వాత అలిగొని ఎలిమినేట్ అయ్యారు. నిక్కి తంబోలి షో నుంచి తొలగించబడ్డాడు. ప్రేక్షకుల ఓటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు నిర్వహకులు తెలిపారు. కాగా, ఫైనల్ షోకు అతిథిగా వచ్చిన బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. షోలే సినిమాలోని పలు డైలాగ్‌లతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు.