![Sidharth Shukla Last Instagram Post On Hospital Staff Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/2/siddarth-shukla.jpg.webp?itok=ZYoIj7M-)
RIP Sidharth Shukla: యువ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన యుక్త వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడితో పాటు హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు, ఇతర బుల్లితెర ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సిద్దార్థ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు)తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సిద్దార్థ్ సోషల్ మీడియాలో చేసిన ఆఖరి పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలకు సలాం చేస్తూనే పారాలింపిక్స్‌లో పతకాలు సాధించినవారికి శుభాకాంక్షలు తెలియజేశాడు.
'ఫ్రంట్‌లైన్ వారియర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ ప్రాణాలను పణంగా పెడతారు. నిరంతరాయంగా పని చేస్తారు. కుటుంబాలతో కలిసి ఉండలేని రోగులకు ఓదార్పునిస్తారు. మీరు నిజంగా ధైర్యవంతులు. ఇలా ముందువరుసలో ఉండి పనిచేయడం అంత ఈజీయేం కాదు, మీ కష్టాన్ని మేము అభినందిస్తున్నాము. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ముంబై డైరీస్ ఈ సూపర్ హీరోల త్యాగాలకు నిదర్శనం. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది' అని సిద్దార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఆఖరి పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఇక ట్విటర్‌లో.. 'భారతీయులు మనం మరోసారి గర్వపడేలా చేస్తున్నారు. పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని చేజిక్కించుకుని ప్రపంచ రికార్డు సాధించిన సుమిత్ అంటిల్, అవని లేఖారాలకు శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు.
Indians making us proud over and over again… a World Record in addition to the #Gold in #Paralympics … congratulations #SumitAntil and #AvaniLekhara
— Sidharth Shukla (@sidharth_shukla) August 30, 2021
Comments
Please login to add a commentAdd a comment