Siddharth Shukla Confirms He Has Not Been Approached For Adipurush - Sakshi
Sakshi News home page

Adipurush: కీలక పాత్రపై స్పందించిన బిగ్‌బాస్‌ విన్నర్

Published Sat, May 29 2021 11:59 AM | Last Updated on Sat, May 29 2021 1:08 PM

Sidharth Shukla Reacts On His Role In Prabhas Adipurush Movie - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే సీతగా కృతీసన్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ను ఎంపిక చేశారు. అలాగే ఓ కీలక పాత్ర పాత్రం బిగ్‌బాస్‌ విన్నర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌ విన్నర్‌ సిద్దార్థ్‌ శుక్లాను మేఘనాథ్‌ పాత్ర చేయనున్నారని, ఇప్పటికే మేకర్స్‌ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు బీటౌన్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

తాజాగా ఇదే విషయంపై సిద్దార్థ్‌ శుక్లాను ప్రశ్నించగా..ఇప్పటివరకు తన వద్దకు ఎవరూ రాలేదని, ఇందులో నిజం ఉందో లేదా కూడా తనకు తెలియదని చెప్పారు. ఆదిపురుష్‌లో కీలకపాత్రకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పాడు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లయ్యింది. హిందీలో బాలికా వధు, దిల్‌ సే దిల్‌ తక్‌ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన సిద్దార్థ్‌..బిగ్‌బాస్‌ సీజన్‌13తో మరింత పాపులర్‌ అయ్యాడు.షెహ్నాజ్‌తో లవ్‌ ట్రాక్‌ అతనికి మరింత కలిసొచ్చింది. గత సీజన్‌ విన్నర్‌గా నిలిచిన సిద్దార్థ్‌ శుక్లా నటించిన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే ఓ వెబ్‌సిరీస్‌ విడుదలకు రెడీగా ఉంది. ఈ సిరీస్‌ గత రెండు సీజన్లు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌ మూడవ సీజన్‌ను ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్‌ ప్రొడ్యూస్‌ చేశారు.

చదవండి : నటితో బిగ్‌బాస్‌ విన్నర్‌ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌
సుషాంత్‌ కేసు: సిద్ధార్థ్‌ కస్టడీకి కోర్టు అనుమతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement