పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ వచ్చినప్పటినుంచి ప్రభాస్ ఆ రేంజ్‌లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. బాహుబలి తర్వాత అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. అయితే రాధేశ్యామ్ రిలీజైన రోజు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా విడుదలైంది. రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవగా చిన్న సినిమా కశ్మీర్ ఫైల్స్ మాత్రం పాజిటివ్ టాక్‌తో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అప్పటి నుంచి బాలీవుడ్‌ను, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ప్రభాస్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు. తాజాగా మరోసారి డార్లింగ్ హీరో మీద, అతడు చేసిన ఆదిపురుష్ చిత్రంపైనా విరుచుకుపడ్డాడు. 'ప్రజల నమ్మకాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు మీక్కూడా దానిపై విశ్వాసం ఉండాలి లేదంటే ఆ సబ్జెక్ట్‌లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉండాలి. దురదృష్టవశాత్తూ భారత్‌లో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పెద్ద పెద్ద స్టార్లతో కలిసి సినిమా చేయాలనుకుంటే అది అంత ఈజీగా పూర్తవదు. ఒకవేళ పూర్తి చేసినా అది సంపూర్ణంగా ఉండదు.
ఈ పురాణాలు వేల సంవత్సరాలుగా అందరి మనసుల్లో ముద్రపడి ఉన్నాయంటే దానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. (ఆదిపురుష్‌లో ప్రభాస్ రోల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ..) కొందరు స్క్రీన్‌పై వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నిజంగానే అతడు భగవంతుడయిపోతాడా? రోజూ రాత్రి ఇంటికి తాగి వచ్చి తెల్లారి నేను దేవుడిని, నన్ను నమ్మండి అని చెప్తే ఎవరూ నమ్మరు. జనాలేమీ పిచ్చోళ్లు కారుగా' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: పెళ్లయిన 8 ఏళ్లకు బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. కానీ కడుపులోనే
ఛాన్స్ ఇవ్వమంటే అవమానించాడు: డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment