Bigg Boss 4 Telugu Winner Abhijeet Suffering With Health Issues, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Abhijeet: ఫ్యాన్స్‌కి షాక్‌.. సినిమాలకు అభిజిత్‌ దూరం

Published Tue, Sep 14 2021 7:42 PM | Last Updated on Wed, Sep 15 2021 8:54 AM

Bigg Boss 4 Abhijeet Suffering With Health Issues, Details Inside - Sakshi

Bigg Boss Fame Abhijeet About His Movies: 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్‌ బిగ్‌బాస్‌ షోతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్‌ ఆడడం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. మిస్టర్‌ కూల్‌తో పాటు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్న అభిజిత్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

షో అనంతరం మిగతా కంటెస్టెంట్లు పలు బర్త్‌డే, ప్రైవేట్‌ పార్టీల్లో పాల్గొంటే అభిజిత్‌ మాత్రం ఎక్కువగా కనపడలేదు. అంతేకాకుండా సోహైల్‌, అఖిల్‌, అరియానా సహా పలువురు  కంటెస్టెంట్లు వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీగా మారితే, సీజన్‌ విన్నర్‌గా నిలిచిన అభిజిత్‌ మాత్రం సెలైంట్‌ అయిపోయాడు. ఆ మధ్య మూడు ప్రాజెక్టులకు సైన్‌ చేసినట్లు చెప్పిన అభిజిత్‌ ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

తాజాగా ట్విట్టర్‌లో 'ఆస్క్‌ మి ఎనీథింగ్‌' అనే సెషన్‌ను నిర్వహించిన అభిజిత్‌కు ఫ్యాన్స్‌ నుంచి కుప్పలు తెప్పలుగా క్వశ్చన్స్‌ వచ్చి పడ్డాయి. సినిమా అప్‌డేట్‌ గురించి చెప్పాల్సిందిగా పలువురు  అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన అభిజిత్‌.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే సినిమాలు చేయట్లేదని చెప్పి అందరికి షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు తనకు ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యం అని తెలిపాడు.  అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో మాత్రం అభిజిత్‌ క్లారిటీ ఇవ్వలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement