Kannada singer
-
గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్ విన్నర్
రైతుబిడ్డ బిగ్‌బాస్ ట్రోఫీ గెలవడం విశేషమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను తెలుగు బిగ్‌బాస్ షోలో పల్లవిప్రశాంత్ సాధించగా ఇటీవల కన్నడ బిగ్‌బాస్ షోలోనూ ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్ విజేతగా రైతుబిడ్డ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత (Hanumantha Lamani) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన అతడు అందరి మనసులు గెలుచుకుని బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును సైతం సొంతం చేసుకున్నాడు.గొర్రెలు మేపడమే ఇష్టంఅరకోటి అందుకున్న హనుమంత.. తనకు గొర్రెలు మేపడమే ఇష్టమని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. గొర్రెల్ని మేపడానికి వెళ్లడం నాకెంతో ఇష్టం. అప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పనిని వదిలేయలేను. బిగ్‌బాస్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌ను చాలా మిస్ అవుతున్నాను. భగవంతుడి ఆశీస్సులున్నాయిఅక్కడ ట్రోఫీ గెలిచానంటే అది నా గెలుపు మాత్రమే కాదు. కర్ణాటక ప్రజల విజయం. వారు ఓటేయడం వల్లే నేను గెలిచాను. అలాగే నేను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదాలు నాపై బలంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్లి పాటలు పాడేవాడిని. అందుకే ఈ రోజు నేనిక్కడున్నాను.ఎవర్ని తీసుకొస్తే వారినే..పెళ్లి విషయానికి వస్తే.. అమ్మానాన్న ఎవర్ని ఎంపిక చేస్తే వారినే వివాహం చేసుకుంటాను. నా పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హనుమంతు.. ఈ షో కంటే ముందు సంగీతంతో పరిచయం లేకపోయినా కన్నడ సరిగమప షో 15వ సీజన్లో పాల్గొన్నాడు. తన గాత్రంతో అందర్నీ మైమరిపించి షో రన్నరప్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by 🧿ಹನುಮಂತ ಲಮಾಣಿ🧿 (@hanumantha_lamani_official_) చదవండి: ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను -
విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సింగర్ కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, నేషనల్ అవార్డు విన్నర్ శివమొగ సుబ్బన్న(83) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కన్నడ గాయకుడైన ఆయన గురువారం రాత్రి బెంగళూరులోని జయదేవ హాస్పిటల్లో గుండెపోటుతో కన్నుమూసినట్లు సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: అది కేవలం ఇండస్ట్రీలోనే కాదు, సమాజమే అలా ఉంది: శ్రుతి హాసన్ కాగా శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న గుర్తింపు పొందారు. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు ఆయన అవార్డును అందుకున్నారు. కువెంపు రచించిన ‘బారిసు కన్నడ డిండిమావ’ పాట ఆయనకు పాపులారిటీని తెచ్చిపెట్టింది. -
ప్రముఖ గాయకుడు ఎల్ఎన్ శాస్త్రి మృతి
సాక్షి, బెంగళూరు : గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎల్.ఎన్.శాస్త్రి(46) బెంగళూరులోని తన ఇంట్లో బుధవారం కన్నుమూశారు. 1998లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఏ.సిపాయి, జోడీహక్కి, జనుమదజోడీ, ఇటీవల విడుదలైన నీర్‌దోసె, లవ్ ఇన్ మండ్య తదితర అనేక చిత్రాల్లో మూడు వేలకుపైగా పాటలు పాడారు. ఇంటెన్సియల్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన నడవలేని పరిస్థితుల్లో ఇంట్లోనే చికిత్స పొందేవారు. ఆయన భార్య సుమా శాస్త్రికి సేవలు చేస్తుండేవారు. ఈ క్రమంలో నేడు ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. శాస్త్రి మరణవార్త తెలుసుకున్న కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.