ప్రముఖ గాయకుడు ఎల్‌ఎన్ శాస్త్రి మృతి
సాక్షి, బెంగళూరు : గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎల్.ఎన్.శాస్త్రి(46) బెంగళూరులోని తన ఇంట్లో బుధవారం కన్నుమూశారు. 1998లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఏ.సిపాయి, జోడీహక్కి, జనుమదజోడీ, ఇటీవల విడుదలైన నీర్‌దోసె, లవ్ ఇన్ మండ్య తదితర అనేక చిత్రాల్లో మూడు వేలకుపైగా పాటలు పాడారు.
ఇంటెన్సియల్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన నడవలేని పరిస్థితుల్లో ఇంట్లోనే చికిత్స పొందేవారు. ఆయన భార్య సుమా శాస్త్రికి సేవలు చేస్తుండేవారు. ఈ క్రమంలో నేడు ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. శాస్త్రి మరణవార్త తెలుసుకున్న కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.