రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంటోందా?
రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంటోందా?
Published Wed, Jan 11 2017 3:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని ఆమె బెస్ట్ ఫ్రెండ్, హాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ అంటోంది. రాఖీ సావంత్ చాలా కష్టపడి పనిచేస్తుందని, రాళ్ల మీద నుంచి కూడా ప్రవహిస్తూనే వెళ్లే నదిలాంటిదని, ఆమె ఎప్పటికీ ఆగదని కూడా చెప్పింది. అమ్మాయిలంతా రాఖీని స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికింది. ఆమె తన స్నేహితురాలు కావడం తన అదృష్టని ఓ ప్రకటనలో చెప్పింది.
కానీ తాను ఆమె గురించి ఆందోళన చెందుతున్నానని, వీలైనంత త్వరగా రాఖీ పెళ్లి చేసుకుంటనే మంచిదని.. కనీసం ఈ ఏడాదైనా ఆమె పెళ్లి చేసుకోవాలని సూచించింది. ఆమెకు మంచి సంబంధం కూడా వెతుకుతున్నట్లు సోఫియా హయత్ వివరించిందది. గతంలో మాలామాల్ వీక్లీ, క్రేజీ 4, 1920 లాంటి సినిమాల్లో నటించిన రాఖీ సావంత్.. ఆ తర్వాత 'రాఖీ కా స్వయంవర్' అనే రియాల్టీ షో నిర్వహించింది. అందులో ఈలేష్ పరుజన్‌వాలా అనే వ్యక్తిని ఎంచుకుంది కూడా. కానీ తర్వాత ఇద్దరూ విడిపోయారు. రాఖీని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదని.. ఆమె సెక్స్ సింబల్‌లాగే కనిపించినా, లోపల మాత్రం రుషిలాంటిదని చెప్పింది. ఆమెను పెళ్లి చేసుకునేవారు ఎవరైనా చాలా అదృష్టవంతులని తెలిపింది.
Advertisement
Advertisement